AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIT Rourkela Jobs 2022: నెలకు రూ. 2,18,200ల జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో 147 నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇంటర్‌/డిగ్రీ అర్హత..

కేంద్ర విద్యాశాఖకు చెందిన ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ).. 147 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

NIT Rourkela Jobs 2022: నెలకు రూ. 2,18,200ల జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో 147 నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇంటర్‌/డిగ్రీ అర్హత..
NIT Rourkela
Srilakshmi C
|

Updated on: Dec 19, 2022 | 1:56 PM

Share

కేంద్ర విద్యాశాఖకు చెందిన ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ).. 147 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌ (10+2)/బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీఈ/బీటెక్/మాస్టర్స్ డిగ్రీ/ఎమ్సెస్సీ/ఎమ్‌సీఏ/ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఆయా పోస్టులకు సంబంధించిన పనిలో అనుభవం కూడా ఉండాలి. వయసు 27 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 16, 2023వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరికి చెందిన వారు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులు రూ.500ల చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు జనవరి 19వ తేదీలోపు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ. 2,18,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • లైబ్రేరియన్ పోస్టులు: 1
  • ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు: 1
  • సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టులు: 1
  • డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు: 1
  • సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు: 1
  • సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు: 1
  • సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు: 1
  • స్టూడెంట్ యాక్టివిటీ అండ్‌ స్పోర్ట్స్ (ఎస్‌ఏఎస్‌) ఆఫీసర్ పోస్టులు: 1
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు: 4
  • మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 3
  • సూపరింటెండెంట్ పోస్టులు: 10
  • టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 36
  • జూనియర్ ఇంజినీర్ పోస్టులు: 3
  • ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్ పోస్టులు: 1
  • లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులు: 3
  • సీనియర్ అసిస్టెంట్ పోస్టులు: 13
  • జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 25
  • సీనియర్ టెక్నీషియన్ పోస్టులు: 12
  • టెక్నీషియన్ పోస్టులు: 29

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!