sukanya samriddhi scheme: ప్రతి నెలా రూ .1000 కంటే తక్కువ పెట్టుబడిపై రూ .4.24 లక్షలు పొందండి.. ఎలానో తెలుసుకోండి..
సుకన్య సమృద్ధి యోజన అనే చిన్న పొదుపు పథకం ద్వారా ఆడ పిల్లల తల్లిదండ్రులు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్రత్యేక పొదుపు పథకం గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన అనే చిన్న పొదుపు పథకం ద్వారా ఆడ పిల్లల తల్లిదండ్రులు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. సుకన్య సమృద్ది యోజన పథకాన్ని 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక పొదుపు పథకం గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం. ఈ పథకాన్ని ప్రత్యేకించి బాలికల పొదుపు పథకంగా , దీర్ఘకాలిక పెట్టుబడి మార్గంగా అత్యంత ప్రజాదరణ పొందిన పథకం ఇది. సాధారణంగా బాలిక పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల వరకు ఈ పథకంలో చేరవచ్చు.
అయితే బాలిక తప్పనిసరిగా భారతీయురాలై ఉండాలి.18 ఏళ్లు దాటిన తర్వాత సదరు బాలిక ఖాతాదారు అవుతుంది. ఆమె కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఒక ఏడాదిలో ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకంపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రారంభంలో ఈ పథకంలో పెట్టుబడిపై 8.4 శాతం వడ్డీరేటు ఆఫర్ చేయగా, ఇప్పుడు 7.6 శాతానికి కుదించారు.
ఈ ఖాతాను ఎవరు తెరవగలరు
ఈ ఖాతాను తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు కుమార్తె పేరు మీద తెరవవచ్చు. కానీ కుమార్తె వయస్సు 10 సంవత్సరాల లోపు ఉండాలి. ఒక కూతురు పేరు మీద ఒకే అకౌంట్ తెరవవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు కుమార్తెలు ఉంటే.. రెండు ఖాతాలు తెరవవచ్చు. అంతకు మించి కాదు. అయితే, ఎవరైనా కవలలు లేదా ముగ్గురు కుమార్తెలు కలిసి ఉంటే 2 కంటే ఎక్కువ ఖాతాలు కూడా తీసుకోవచ్చు. మీరు రూ .250 కనీస డిపాజిట్‌తో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ .250 నుంచి గరిష్టంగా రూ .1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాల వరకు డబ్బు జమ చేయాలి. రూ .250 కనీస డిపాజిట్ ఏ సంవత్సరంలో చేయకపోతే ఆ ఖాతా డిఫాల్ట్ ఖాతాగా పరిగణించబడుతుంది.
ఎంత డిపాజిట్ చేయాలి..
సుకన్య సమృద్ధి యోజన ఖాతా డిఫాల్ట్ అయితే.. దాన్ని మళ్లీ ప్రారంభించడానికి ప్రత్యేక నియమం ఉంది. ఖాతా తెరిచిన సంవత్సరం నుండి 15 సంవత్సరాల పాటు కనిష్టంగా రూ .250 నుంచి డిఫాల్ట్ రూ .50 కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం కింద ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తానికి 80C కింద పన్ను మినహాయించబడుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచనల మేరకు మాత్రమే ఖాతాలో జమ చేసిన మొత్తానికి వడ్డీ చెల్లించబడుతుంది. ఈ కారణంగా ప్రజలు పన్నును ఆదా చేయడానికి ఇది మంచి మార్గంగా భావిస్తారు.
ఖాతా ఎప్పుడు క్లోజ్ చేయవచ్చు..
కూతురికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 10 వ తరగతి దాటిన తర్వాత డబ్బు తీసుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత ఖాతాను మూసివేయడానికి కొన్ని షరతులు ఉన్నాయి. అకౌంట్ హోల్డర్ చనిపోతే లేదా ఏదైనా తీవ్రమైన అనారోగ్యం ఉంటే.. అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్న వ్యక్తి చనిపోతే అకౌంట్ క్లోజ్ చేయవచ్చు. ఖాతాను మూసివేయడానికి అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దానితో పాటు అప్లికేషన్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. పాస్‌బుక్‌తో దరఖాస్తు ఫారమ్‌ను పూరించడం పోస్ట్ ఆఫీస్‌లో లేదా ఖాతా నడుస్తున్న బ్యాంకులో సమర్పించాలి.
సుకన్య సమృద్ధి యోజన అర్హతలు, ప్రయోజనాలు:
- పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఆడపిల్లల పేరి మీద వారి సంరక్షకులు ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
- పోస్టాఫీసులో లేదా బ్యాంకులలోనైనా సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
- ఒక కుటుంబంలోని ఇద్దరు బాలికలు ఉన్న కూడా ఖాతా ఓపెన్ చేయవచ్చు.
- ఈ ఖాతాను ఓపెన్ చేయడానికి కనీసం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
- ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు ఏడాదికి నగదు జమ చేయవచ్చు.
- ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అంటే స్కీమ్‌లో చేరి 21 ఏళ్ల తర్వాతనే డబ్బులు తీసుకోగలం.
- అమ్మాయికి 18 ఏళ్లు దాటిన తర్వాత కొంత నగదు తీసుకోవచ్చు.
- సుకన్య సమృద్ధి ఖాతా తెరిచిన దగ్గరి నుంచి 21 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు జమ చేయాలి.
- ప్రతి నెలకు రూ.3 వేలు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే మెచ్యూరిటీ కాలానికి రూ.15 లక్షలకు పైగా పొందవచ్చు.
ఇవి కూడా చదవండి: E-Shram Card: అసంఘటిత రంగం కార్మికులకు ఓ వ్యవస్థ ఈ-శ్రామ్ కార్డ్.. ఇది ఎలా ఫిల్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి