AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Rates Hike: ఖాతాదారులకు ఆ బ్యాంకు శుభవార్త..సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు భారీగా పెంపు

ప్రస్తుతం అన్ని బ్యాంకులు తమ ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాదారులకు వడ్డీ రేటు పెంపును ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ జాబితాలో హెచ్ ఎస్ బీసీ బ్యాంకు కూడా చేరింది. రూ.2 కోట్ల లోపు దేశీయ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ ను పెంచుతున్నట్లు బ్యాంక్ వెబ్ సైట్ లో ప్రకటించింది.

FD Rates Hike: ఖాతాదారులకు ఆ బ్యాంకు శుభవార్త..సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు భారీగా పెంపు
Money
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 26, 2022 | 2:20 PM

Share

కష్టపడి సంపాదించిన సొమ్మును ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలని అందరూ అనుకుంటారు. అలా రిస్క్ లేకుండా బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీపై కాలం గడుపుతుంటారు. అయితే ఇలాంటి వారిని ఆకట్టుకోడానికి బ్యాంకులు కూడా ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ప్రస్తుతం అన్ని బ్యాంకులు తమ ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాదారులకు వడ్డీ రేటు పెంపును ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ జాబితాలో హెచ్ ఎస్ బీసీ బ్యాంకు కూడా చేరింది. రూ.2 కోట్ల లోపు దేశీయ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ ను పెంచుతున్నట్లు బ్యాంక్ వెబ్ సైట్ లో ప్రకటించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు డిసెంబర్ 19 2022 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. 

హెచ్ ఎస్ బీసీ బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుంచి 60 నెలల వరకు మెచ్యూరయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లను సాధారణ ప్రజలకు 2.85 శాతం నుంచి 6.00 శాతం వరకు పెంచింది. సీనియర్ సిటిజన్‌లకు 3.35 శాతం నుంచి 6.50 శాతం వరకు అందిస్తుంది. 36 నెలల నుంచి 37 నెలల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ప్రస్తుతం సీనియర్ సిటిజన్‌లకు గరిష్టంగా 7 శాతం నుంచి 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అయితే 7 నుంచి 8 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై, బ్యాంక్ 2.85 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.  9  నుంచి 29 రోజులలో మెచ్యూరయ్యే డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 30 నుంచి 59 రోజులకు 3.40 శాతం, 60 నుంచి 89 రోజులలో మెచ్యూరయ్యే ఎఫ్ డీల కోసం 3.60 శాతం అందిస్తుంది. అలాగే 90 నుంచి 94 రోజుల ఎఫ్ డీలపై 3.80 శాతం, 95 నుంచి 179 రోజుల మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వడ్డీ 4.00 శాతం చొప్పున చెల్లిస్తుంది. 

అయితే వడ్డీ రేట్ సవరణ ఎక్కువ రోజుల ఎఫ్ డీల్లో పెట్టుబడి వారికే లాభం చేకూరుస్తుంది. 701 నుండి 731 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ లభిస్తుంది. 732 రోజుల నుండి 36 నెలల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూరయ్యే డిపాజిట్లకు 6.50 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా, 36 నెలల నుంచి 37 నెలల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూరయ్యే డిపాజిట్లకు 7.00 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. హెచ్ ఎస్ బీసీ బ్యాంక్ 37 నుంచి 60 నెలల వరకు మెచ్యూరిటీలతో FDలపై 6.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీ సీనియర్ సిటిజన్లకు మరింత ఎక్కువ రానుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

Follow Us
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే