రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా రెపో రేటు పెంచిన తర్వాత బ్యాంకులు మే 2022 నుండి ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు ఇటీవల టర్మ్ డిపాజిట్లపై వడ్డీని పెంచిన రుణదాతల్లో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంకులు ఉన్నాయి. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీ)లు కస్టమర్లకు లాభదాయకమైన రేట్లను అందిస్తాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ కొన్ని డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 7% కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.