AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Interest Rates: ఆర్ బీఐ చర్యలతో పెరిగిన ఎఫ్ డీ వడ్డీ రేట్లు…. ఏ బ్యాంక్ ఎంత ఇస్తుందంటే..?

ఆర్ బీఐ డిసెంబర్ మానిటరీ పాలసీలో రెపో రేట్లను 0.35 శాతం నుంచి 6.25 శాతం వరకూ పెంచింది. దీంతో అన్ని బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. సీనియర్ సిటిజన్ల వడ్డీ రేట్లను తప్పనిసరిగా పెంచుతున్నాయి. బ్యాంక్ ను బట్టి 0.5 నుంచి 0.75 బేసిక్ పాయింట్ల వరకూ పెరిగింది.

FD Interest Rates: ఆర్ బీఐ చర్యలతో పెరిగిన ఎఫ్ డీ వడ్డీ రేట్లు…. ఏ బ్యాంక్ ఎంత ఇస్తుందంటే..?
Indian Rupee
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 24, 2022 | 8:13 PM

Share

సీనియర్ సిటిజన్లు ఎఫ్ డీ వేస్తున్నారంటేనే వారు జీవితాంతం కష్టపడిన డబ్బు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని దాచుకునే భరోసా. అయితే అలాంటి వారు ఆశగా చూసేది వడ్డీ రేట్. ఏ బ్యాంక్ అధిక వడ్డీ రేట్ ఇస్తుందో తెలుసుకుని అందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆర్ బీఐ డిసెంబర్ మానిటరీ పాలసీలో రెపో రేట్లను 0.35 శాతం నుంచి 6.25 శాతం వరకూ పెంచింది. దీంతో అన్ని బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. సీనియర్ సిటిజన్ల వడ్డీ రేట్లను తప్పనిసరిగా పెంచుతున్నాయి. బ్యాంక్ ను బట్టి 0.5 నుంచి 0.75 బేసిక్ పాయింట్ల వరకూ పెరిగింది. ఈ నేపథ్యంలో టాప్ బ్యాంక్స్ ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, పీఎన్ బీ, కెనరా సహా అనేక బ్యాంకులు తమ ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. అవి ఏ రేంజ్ లో ఉన్నాయో? తెలుసుకుందాం. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI): 

ఎస్ బీఐ తన ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ ను ఇటీవల 65 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 13 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పెంపు తర్వాత సీనియర్ సిటిజన్ల ఎఫ్ డీలపై ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల మధ్య కాలానికి 3.50 శాతం నుంచి 7.25 మధ్య వడ్డీ రేట్ ను ఆఫర్ చేస్తుంది. 

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్

ఈ బ్యాంక్ రెండు కోట్ల రూపాయల లోపు వరకూ వేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. పెరుగుదల తర్వాత సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ రేటు ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల కాలాని 3.50 శాతం నుంచి 7.50 శాతం వరకూ ఉంది. ఈ వడ్డీ రేట్ డిసెంబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది. 

ఇవి కూడా చదవండి

ఐసీఐసీఐ బ్యాంక్

ఐసీఐసీఐ బ్యాంక్ కూడా రూ.రెండు కోట్ల లోపు ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపును ఆఫర్ చేస్తుంది. ఇటీవల ఈ బ్యాంక్ ఎఫ్ డీ రేట్లను 60 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. దీంతో ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల కాల వ్యవధి ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్ 3.5 శాతం నుంచి 7.50 శాతం వరకూ ఉంది. ఈ ఆదేశాలు డిసెంబర్ 16 నుంచి అమల్లోకి వస్తాయి. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్ వడ్డీ రేట్ ఇలా

పీఎన్ బీ వెబ్ సైట్ ప్రకారం రూ.2 కోట్ల లోపు ఉన్న ఎఫ్ డీలపై 50 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. దీంతో సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంక్ ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల కాలవ్యవధి ఉన్న డిపాజిట్లకు అందించే వడ్డీ రేట్ 4 శాతం నుంచి 7. 75 శాతం వరకూ ఉంది. 

కెనరా బ్యాంక్

ప్రభుత్వ రంగ బ్యాంక్ కెనరా బ్యాంక్ కూడా తన బ్యాంకులో రూ. 2 కోట్ల రూపాయల లోపు ఉన్న ఎఫ్ డీలపై వడ్డ రేట్ ను పెంచింది. బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ప్రకారం ఈ పెంపు డిసెంబర్ 19 నుంచి  అమల్లోకి వస్తాయి. ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల 3.25 శాతం నుంచి 7.50 శాతం వడ్డీ రేట్ ను అందిస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

Follow Us
అమ్మమ్మ కాలం నాటి పులిహోర గోంగూర పచ్చడి..
అమ్మమ్మ కాలం నాటి పులిహోర గోంగూర పచ్చడి..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తినేశాారా.. బొప్పాయి వీరికి విషం..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తినేశాారా.. బొప్పాయి వీరికి విషం..
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌