Savings: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే ఈ ఇబ్బందులు తప్పవు..

భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలనుకునే చాలామంది ఎంచుకునే పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్లు. ఎంపిక చేసుకున్న కాలపరిమితిలో డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మంచి వడ్డీ లభిస్తుంది. కానీ మెచ్యూరిటీ వ్యవధి కంటే..

Savings: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే ఈ ఇబ్బందులు తప్పవు..
Bank Interest Rate
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 21, 2022 | 9:23 AM

భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలనుకునే చాలామంది ఎంచుకునే పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్లు. ఎంపిక చేసుకున్న కాలపరిమితిలో డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మంచి వడ్డీ లభిస్తుంది. కానీ మెచ్యూరిటీ వ్యవధి కంటే ముందు ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేయలేరు . అలా చేస్తే అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా సీనియర్ సిటిజన్‌లు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే సీనియర్ సిటిజన్లకు అనేక బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. కొంత నిర్ధిష్ట కాలానికి నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అన్ని బ్యాంకులు ఒకటే వడ్డీ రేటును చెల్లించవు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. పోస్టాఫీసులో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా తెరవవచ్చు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టే ముందు దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెడితే మంచి రాబడిని పొందవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా తెరవాలనుకుంటే.. అవసరమైన డాక్యుమెంట్స్‌తో సమీపంలోని బ్యాంకుకు వెళ్లాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాకు సంబంధించిన అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టాల్సిన మొత్తాన్ని డిపాజిట్ చేయాలి.

మెచ్యూరిటీ కాలానికి ముందు నగదు తీసుకుంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి నిర్ణీత కాలానికి జమ చేయబడుతుంది. నిర్ణీత వ్యవధి కంటే ముందే మీ మొత్తాన్ని విత్‌డ్రా చేస్తే వినియోగదారుడుకి నష్టం వస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో 5 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని మెచ్యూరిటీ తర్వాత మాత్రమే ఆ అమౌంట్ విత్‌డ్రా చేసుకోవచ్చు.లేదు అవసరం అనుకుంటే కనీసం ఒక సంవత్సరం పాటు వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక సంవత్సరం డిపాజిట్‌పై మాత్రమే వర్తించే వడ్డీ రేటును పొందగలుగుతారు.

ఇవి కూడా చదవండి

ఫిక్స్‌డ్ డిపాజిట్‌ వడ్డీపై పన్ను

ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే ఆదాయాలపై పన్ను విధించబడుతుంది. మీ వడ్డీ మొత్తం రూ.10,000 వరకు ఉంటే, మీరు అందుకున్న మొత్తంపై బ్యాంక్ 10.3% పన్నును తీసుకుంటుంది. అదేవిధంగా వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే, మీరు మరింత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80టిటిబి కింద ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో సంపాదించిన ఆదాయంపై రూ. 50,000 వరకు తగ్గింపును పొందుతారు. అలాగే, మీరు మీ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?