Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Tips: క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. ఈ తప్పులు చేశారంటే.. మీరు మటాష్..

Credit Card Tips: ఇప్పుడంతా అప్పులయుగం నడుస్తోంది. లక్షల్లో జీతాలు వస్తున్నా.. రుణాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. గతంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే బయట వ్యక్తుల వద్ద వడ్డీకో, చేబదులో తీసుకొనేవారు. రానూరానూ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం డిజటల్..

Credit Card Tips: క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. ఈ తప్పులు చేశారంటే.. మీరు మటాష్..
Credit Cards
Follow us
Amarnadh Daneti

| Edited By: Anil kumar poka

Updated on: Dec 26, 2022 | 2:32 PM

Credit Card Tips: ఇప్పుడంతా అప్పులయుగం నడుస్తోంది. లక్షల్లో జీతాలు వస్తున్నా.. రుణాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. గతంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే బయట వ్యక్తుల వద్ద వడ్డీకో, చేబదులో తీసుకొనేవారు. రానూరానూ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం డిజటల్ యుగంలో క్రెడిట్ కార్డు వినియోగం పెరిగిపోయింది. అవసరం ఉన్నా లేకున్నా.. పడి ఉంటుందిలే.. అనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారు.  అంతేకాదు  క్రెడిట్ కార్డ్‌లను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డ్‌పై డిస్కౌంట్లు, ఆఫర్‌లు అందుబాటులో ఉన్న రివార్డ్ పాయింట్‌ల వరకు అనేక వెసులుబాట్లు ఉండటంతో వీటివైపు ఆకర్షితులవుతున్నారు.  క్రెడిట్ కార్డ్ నిజానికి అప్పు అని చాలా మందికి తెలియదు. క్రెడిట్ కార్డు తీసుకుంటే మనం అప్పు చేసి.. ఖర్చు పెట్టడం కోసం మన దగ్గర పెట్టుకున్నట్లే.. అందులో డబ్బులు వాడుకుంటే  వాయిదాల పద్ధతిలో తర్వాత చెల్లించాలి. సకాలంలో చెల్లించకపోతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.  సకాలంలో బిల్లు తిరిగి చెల్లించలేకపోతే.. ఎక్కుడ డబ్బును కోల్పోవడమే కాకుండా, సిబిల్ స్కోర్ కూడా దెబ్బతింటుంది.  క్రెడిట్ కార్డ్‌ని వాడేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తించుకోవాలి. దేనికి వాడాలి, దేనికి వాడకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఏ సందర్భాల్లో క్రెడిట్ కార్డు వాడకూడదో తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డును ఇచ్చే ప్రతి కంపెనీ ఖచ్చితంగా ATM ద్వారా కూడా ఆ కార్డు నుంచి నగదు తీసుకోవటానికి అనుమతిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై మీకు ఒక నెల సమయం మాత్రమే ఉంటుంది. మరోవైపు నగదుపై.. మీకు చెల్లింపు కోసం సమయం ఉండదు. అందువల్ల నగదు విత్ డ్రా చేసుకున్న వెంటనే మీపై వడ్డీ భారం ప్రారంభమవుతుంది. ఈ వడ్డీ నెలకు 2.5 నుంచి 3.5 శాతం వరకు ఉంటుంది. ఇది మాత్రమే కాదు.. మీరు దీనిపై ఫ్లాట్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు విదేశాల్లో కూడా ఆ కార్డును వినియోగించుకోవచ్చని సంస్థలు చెబుతాయి. కాని  విదేశాల్లో మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినందుకు విదేశీ కరెన్సీ లావాదేవీల ఛార్జీలను వసూలు చేస్తాయి. అదే సమయంలో.. మారకం రేటులో హెచ్చుతగ్గుల ప్రభావం వినియోగ దారులపై పడుతుంది. మీరు విదేశాల్లో నగదు ఉపయోగించకూడదనుకుంటే.. క్రెడిట్ కార్డ్‌కు బదులుగా ప్రీపెయిడ్ కార్డ్‌ని ఉపయోగించటం ఉత్తమం. కాబట్టి విదేశాల్లో క్రెడిట్ కార్డు వినియోగించడం వల్ల అదనపు బారం పడుతుంది.

ఇవి కూడా చదవండి

చాలా సార్లు ప్రజలు తమ క్రెడిట్ కార్డులను పూర్తి లిమిట్ వరకు ఉపయోగిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో.. కొన్ని సార్లు క్రెడిట్ కార్డుపై ఉండే క్రెడిట్ పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. గుర్తుంచుకోండి.. మీరు మీ పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, దాని కోసం కంపెనీ మీకు ఛార్జీ కూడా విధిస్తుంది.  మరోవైపు వినియోగదారులు క్రెడిట్ పరిమితిలో 30 శాతం కంటే ఎక్కువ ఉపయోగిస్తే.. అది మీ సిబిల్ స్కోర్‌పై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుంది.

క్రెడిట్ కార్డ్‌లలో బ్యాలెన్స్ బదిలీ ఎంపిక అందుబాటులో ఉంది. బ్యాలెన్స్ బదిలీ అంటే మీరు మీ క్రెడిట్ కార్డ్‌లలో ఒకదాని నుంచి మరొక క్రెడిట్ కార్డ్‌కి బిల్లులను చెల్లించవచ్చు. అయితే.. దీని కోసం మీరు కొంత వడ్డీ కూడా చెల్లించాలి. కొన్నిసార్లు బ్యాలెన్స్ బదిలీ లాభదాయకమైనదే. కానీ ఒక కార్డు బిల్లును మరొక దాని నుంచి చెల్లించే విధంగా చేయవద్దు. ఆపై రెండవది, మూడవది నుంచి నాల్గవదానికి చెల్లింపులు చేయటం వల్ల మీ సిబిల్ స్కోర్ తీవ్రంగా దెబ్బతింటుంది. వాస్తవానికి మీరు ఒక రుణాన్ని చెల్లించటానికి మరొక రుణాన్ని తీసుకుంటున్నారని.. దాని కోసం ఇంకొకటి తీసుకుంటున్నారని అర్థం. ఇలా చేయటం వల్ల దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..