RBI: దేశంలో పెరుగుతున్న బ్యాంకింగ్ మోసాల సంఖ్య.. కారణాలు ఏమిటో చెప్పిన ఆర్బీఐ..

డిజిటల్‌ లావాదేవీల సంఖ్య పెరుగుతున్నాయి. అయినా సరే మోసగాళ్లు సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. కొంతమందిని బురిడి కొట్టించి.. వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు మాయం చేస్తున్నారు. ఇలాంటి వాటి సంఖ్య ప్రతి..

RBI: దేశంలో పెరుగుతున్న బ్యాంకింగ్ మోసాల సంఖ్య.. కారణాలు ఏమిటో చెప్పిన ఆర్బీఐ..
Bank Fraud (file Photo)
Follow us

|

Updated on: Dec 28, 2022 | 7:56 AM

డిజిటల్‌ లావాదేవీల సంఖ్య పెరుగుతున్నాయి. అయినా సరే మోసగాళ్లు సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. కొంతమందిని బురిడి కొట్టించి.. వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు మాయం చేస్తున్నారు. ఇలాంటి వాటి సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతున్నాయని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ మోసాల కేసులు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న నగదు మొత్తం 2020-21తో పోలిస్తే సగానికంటే తక్కువని తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘దేశంలో బ్యాంకుల ట్రెండ్స్ అండ్ ప్రోగ్రెస్’ పేరుతో ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదికలో గత ఆర్థిక సంవత్సరంలో రూ.60,389 కోట్ల మోసాలకు సంబంధించిన 9,102 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇటువంటి కేసుల సంఖ్య 7,358 కాగా, వాటిలో రూ.1.37 లక్షల కోట్ల మోసం జరిగిందని ఆర్బీఐ ప్రకటించింది. అయినప్పటికీ, రుణ కార్యకలాపాలలో మోసాల కేసుల్లో తగ్గుదల ఉందని, గత ఆర్థిక సంవత్సరంలో ఇటువంటి కేసులు 1,112కి తగ్గాయని తెలిపింది. వీటిలో రూ.6,042 కోట్ల రూపాయల నగదు ఉండగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,477 మోసాల కేసుల్లో రూ.14,973 కోట్ల రూపాయలు ఉన్నట్లు వెల్లడించింది.

బ్యాంక్ మోసాల సంఖ్య పరంగా కార్డ్ లేదా ఇంటర్నెట్ లావాదేవీలపై మోసాగాళ్లు ఎక్కువుగా గురి పెడుతున్నారని సెంట్రల్ బ్యాంక్ ఈ నివేదికలో తెలిపింది. దీంతోపాటు నగదు రూపంలో మోసాలు పెరుగుతున్నాయని, వీటిలో లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మోసం కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. అలాగే డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) గత ఆర్థిక సంవత్సరంలో రూ. 8,516.6 కోట్ల విలువైన క్లెయిమ్‌లను పరిష్కరించిందని ఆర్‌బిఐ తెలిపింది. వీటిలో అధిక భాగం పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లే ఉన్నారని తెలిపింది.

ఆర్బీఐ హెచ్చరిక

OTP, CVV వంటి సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని RBI బ్యాంక్ ఖాతాదారులను కోరింది. సామాన్య ప్రజల కష్టార్జిత సొమ్మును మాయ చేసేందుకు మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తూనే ఉంది. దీని కారణంగా ప్రజలు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సి అవసరం ఎంతైనా ఉంది. మోసాల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని ఆర్‌బీఐ బుక్‌లెట్‌లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..