Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST: పన్ను చెల్లింపు దారులకు హెచ్చరిక.. జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఎవరికి వర్తిస్తాయంటే..

GST: వస్తు, సేవల పన్ను నిబంధనలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు మార్పులు చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 30లోగా సరఫరాదారు చెల్లించాల్సిన పన్నును జమ చేయని పక్షంలో, GST పన్ను చెల్లింపుదారులు

GST: పన్ను చెల్లింపు దారులకు హెచ్చరిక.. జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఎవరికి వర్తిస్తాయంటే..
Gst
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 28, 2022 | 9:17 AM

GST: వస్తు, సేవల పన్ను నిబంధనలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు మార్పులు చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 30లోగా సరఫరాదారు చెల్లించాల్సిన పన్నును జమ చేయని పక్షంలో, GST పన్ను చెల్లింపుదారులు గత ఆర్థిక సంవత్సరంలో చేసిన తమ ఇన్‌పుట్‌ ట్యాక్స్ క్రెడిట్ (ITC) క్లెయిమ్‌లను నవంబర్ 30 లోపు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నిబంధనలో చేసిన ఈ మార్పుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనితో పాటు, పన్ను చెల్లింపుదారులు పన్నును సరఫరాదారు డిపాజిట్ చేసిన తర్వాత మళ్లీ ఇన్‌పుట్‌ ట్యాక్స్ క్రెడిట్‌ని క్లెయిమ్ చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కొత్త నిబంధనను అమలు చేయడానికి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (CGST) నిబంధనలలోని సెక్షన్ 37Aలో మార్పులు చేసింది కేంద్ర ఆర్థిక శాఖ. పన్ను చెల్లింపుదారుడు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ క్లెయిమ్ చేసినక్రమంలో సరఫరాదారు ఆ కాలానికి చెల్లించాల్సిన పన్నును సెప్టెంబర్ 30లోపు జమ చేయకుంటే, ఆ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను నవంబర్ 30లోగా రివర్స్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

ఈ మార్పు ఎంపిక చేసిన కేసులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని AMRG అసోసియేట్స్ సీనియర్ భాగస్వామి రజత్ మోహన్ తెలిపారు. దీనికి గల కారణాన్ని ఆయన వివరిస్తూ, ఈ నిర్ణయం వల్ల 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు ఎటువంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ఈ పరిధిలో చాలా తక్కువ కేసులు మాత్రమే ఉంటాయన్నారు.

GST అనేది పరోక్ష పన్ను విధానం, వ్యాట్, కొనుగోలు పన్ను, ఎక్సైజ్‌ సుంకం వంటి అనేక పరోక్ష పన్నుల స్థానంలో దీనిని 2017లో అమలు చేశారు. భారతదేశంలో GST కోసం రిజిస్ట్రేషన్ పరిమితి గతంలో రూ. 20 లక్షల కాగా. ఇప్పుడు దాన్ని రూ.40 లక్షలకు పెంచారు. ఇప్పుడు 40 లక్షల రూపాయల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న అన్ని వ్యాపారాలు GST రిజిస్ట్రేషన్‌ను పొందాల్సిన అవసరం ఉంది. GST 2017 కింద నమోదు చేసుకోవడానికి, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ, కశ్మీర్ సహా ఈశాన్య రాష్ట్రాలకు టర్నోవర్ రూ.10 లక్షలు ఉండాలి. చాలా రాష్ట్రాల్లో రూ.20 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న రెస్టారెంట్లు జీఎస్టీలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..