Sohel-Inaya: ప్రాణం ఉన్నంతవరకు ప్రేమిస్తూనే ఉంటా.. సొహైల్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేసిన బిగ్‌బాస్‌ ఇనయా.. వీడియో వైరల్‌

ఇటీవల ముగిసిన బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 6తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇనయా సుల్తానా. విజేతగా నిలవకపోయినా తన ఆటతీరు, ప్రవర్తనతో అభిమానుల మనసులు గెల్చుకుంది. అందుకే ఆమె షో నుంచి ఎలిమినేట్‌ అయినప్పుడు అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అంటూ ఫ్యాన్స్ బిగ్‌బాస్‌ టీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు

Sohel-Inaya: ప్రాణం ఉన్నంతవరకు ప్రేమిస్తూనే ఉంటా.. సొహైల్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేసిన బిగ్‌బాస్‌ ఇనయా.. వీడియో వైరల్‌
Inaya Sultana, Sohel
Follow us
Basha Shek

|

Updated on: Dec 27, 2022 | 12:23 PM

ఇటీవల ముగిసిన బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 6తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇనయా సుల్తానా. విజేతగా నిలవకపోయినా తన ఆటతీరు, ప్రవర్తనతో అభిమానుల మనసులు గెల్చుకుంది. అందుకే ఆమె షో నుంచి ఎలిమినేట్‌ అయినప్పుడు అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అంటూ ఫ్యాన్స్ బిగ్‌బాస్‌ టీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో తన క్రష్‌ గురించి చెప్పుకొచ్చింది. అతనెవరో కాదు.. గత బిగ్‌బాస్‌ షోలో సందడి చేసిన సయ్యద్‌ సొహైల్‌. వీరిద్దరికి మంచి అనుబంధం ఉంది. అందుకు తగ్గట్లే బిగ్‌బాస్‌6 స్టేజ్‌పై ఇనాయాను సపోర్ట్‌ చేస్తూ సొహైల్ మాట్లాడాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్‌ థింగ్‌.. సమ్‌థింగ్ నడుస్తోందని పుకార్లు వచ్చాయి. తాజాగా బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన ఇనయ సోహైల్‌ ను కలిసింది. అంతేకాదు అతనిపై తన మనసులో ప్రేమను బయట పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మొదట ‘మీ కోసం ఒక సర్ ప్రైజ్ ఉంది’ అని ఇనయా చెప్పగా, ‘నువ్వు రాగానే నేను షాక్ అయిపోయా’ అని సొహైల్‌ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ‘బిగ్‌బాస్‌ నుంచి బయటకు ఏం చేయలేదు. నీతోనే మాట్లాడాలని ఇలా వచ్చాను’ అని ఇనయా చెప్పగా, థ్యాంక్స్ అని సొహైల్‌ రిప్లై ఇచ్చాడు. ఇక ఆ తర్వాత రోజ్ ఫ్లవర్ బొకే తీసుకుని వెళ్లి సోహైల్ ముందు మోకాళ్ల మీద కూర్చుని మరీ ప్రపోజ్‌ చేసింది ఇనయా.

‘ఒకటి చెప్పదలచుకున్నాను.. నువ్వు ఏం అనుకున్నా పర్వాలేదు. నా మనసులో ఉన్నది నేను చెబుతానా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నా సోహైల్‌. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నాకు నువ్వంటే చాలా ఇష్టం’ అని సొహైల్‌పై ప్రేమను కురిపించింది ఇనయా.అయితే దీనికి సొహైల్‌ ఏం సమాధానమిచ్చాడో మాత్రం సస్పెన్స్‌లో పెట్టిందీ బిగ్‌బాస్‌ బ్యూటీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. ‘మీరిద్దరూ బెస్ట్‌ జోడి’ అంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. మరోవైపు సోహెల్ హీరోగా న‌టిస్తోన్న ల‌క్కీ ల‌క్ష్మణ్‌ సినిమా డిసెంబ‌ర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..