- Telugu News Photo Gallery Cinema photos Surya Web series actress Mounika Reddy marriage photos goes viral in Social media
Mounika Reddy: సూర్య వెబ్ సిరీస్ హీరోయిన్ పెళ్లి ఫొటోలు చూశారా? కొత్త దంపతులు ఎంత క్యూట్‌గా ఉన్నారో?
విష్వక్ సేన్ ఓరి దేవుడా, తాజాగా విడుదలైన రవితేజ ధమాకా సినిమాల్లోనూ మౌనిక నటించింది. ఇలా బుల్లితెరతో పాటు వెండితెరపై సందడి చేస్తోన్న ఈ ట్యాలెంటెడ్ నటి తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
Updated on: Dec 27, 2022 | 11:39 AM

షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి సూర్య వెబ్ సిరీస్‌లో నటించి ఓవర్‌నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది మౌనికారెడ్డి. ఇదే క్రేజ్‌తో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ చిత్రంలో లేడీ కానిస్టేబుల్ పాత్రలో కనిపించిన మౌనికా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఆతర్వాత విష్వక్ సేన్ ఓరి దేవుడా, తాజాగా విడుదలైన రవితేజ ధమాకా సినిమాల్లోనూ నటించింది. ఇలా బుల్లితెరతో పాటు వెండితెరపై సందడి చేస్తోన్న మౌనికా తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

మౌనికా రెడ్డి సందీప్ కూరపాటి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ నెల 17, 18 తేదీల్లో గోవా వేదికగా ఈ వివాహం జరిగింది.కేవలం ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల, స్నేహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

తాజాగా సోషల్ మీడియాలో మౌనికా రెడ్డి పెళ్లి ఫొటోలను పంచుకోగా అవికాస్తా వైరల్ అవుతున్నాయి. ఇందులో మౌనిక అండ్ సందీప్ ఎంతో క్యూట్‌గా ఉన్నారంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కాగా మొదట స్నేహితులుగా పరిచయమయ్యారు మౌనికా-సందీప్. ఆ తర్వాతి రోజుల్లో ప్రేమికులుగా మారారు. ఇప్పుడు పెద్దల అనుమతితో గోవా వేదికగా పెళ్లిపీటలెక్కారు.




