Rashmika Mandanna: స్టేజ్‌ డ్యాన్స్‌తో మరోసారి అదరగొట్టిన రష్మిక.. జానీ మాస్టర్‌తో కలిసి మాస్‌ స్టెప్పులు.. వీడియో వైరల్

ప్రముఖ హీరోయిన్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందాన మరోసారి అదరగొట్టింది. స్టేజ్‌ డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది. ప్రముఖ కొరియాగ్రాఫర్‌ జానీ మాస్టర్‌తో కలిసి మాస్‌ స్టెప్పులేసింది.

Rashmika Mandanna: స్టేజ్‌ డ్యాన్స్‌తో మరోసారి అదరగొట్టిన రష్మిక.. జానీ మాస్టర్‌తో కలిసి మాస్‌ స్టెప్పులు.. వీడియో వైరల్
Rashmika Mandanna
Follow us
Basha Shek

|

Updated on: Dec 27, 2022 | 8:36 AM

ప్రముఖ హీరోయిన్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందాన మరోసారి అదరగొట్టింది. స్టేజ్‌ డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది. ప్రముఖ కొరియాగ్రాఫర్‌ జానీ మాస్టర్‌తో కలిసి మాస్‌ స్టెప్పులేసింది. వరిసు (తెలుగులో వారసుడు) సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ రంజితమే సాంగ్‌కు వీరిద్దరూ దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం వరిసు. ఈసినిమాను తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. రష్మిక విజయ్‌ తో రొమాన్స్ చేయనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న వారసుడు సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో స్పీడ్‌ పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా చెన్నైలో వరిసు ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రష్మికతో పాటు చిత్రబృందమంతా సందడి చేసింది.

కాగా ఈ కార్యక్రమంలోనే మరోసారి స్టేజ్‌ డ్యాన్స్‌ తో అదరగొట్టింది రష్మిక. రంజితమే సాంగ్‌కు జానీ మాస్టర్‌తో కలిసి హుషారైన స్టెప్పులు వేసింది. వీరిద్దరి డ్యాన్స్‌ ఫెర్మామెన్స్‌కు స్టేజ్‌ దద్దరిల్లింది. ఫ్యాన్స్‌ ఈలలు, కేకలు వేస్తూ ఆడిటోరియాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా రంజితమే సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్‌, రష్మిక వేసిన స్టెప్పులు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే పాటకు ఆఫ్‌ స్ర్కీన్‌లో స్టెప్పులేసి మెస్మరైజ్‌ చేసింది రష్మిక. కాగా తమిళ్‌ తో పాటు తెలుగులో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు