Gautam Adani: భారత బిలినీయర్ గౌతమ్ అదానీకి ప్రేరణ ఆ ఇద్దరు మహిళలేనంట.. రియల్ హీరోస్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్న పారిశ్రామిక వేత్త..
Gautam Adani: ప్రతి ఒక్కరి జీవితానికి ఎవరో ఒకరు ప్రేరణగా నిలుస్తారు. ముఖ్యంగా జీవితంలో విజయాలను అందుకుని.. ఏ రంగంలో అయినా ఉన్నతస్థానానికి చేరుకున్న వ్యక్తులకు తప్పనిసరిగా ఎవరో ఒకరి జీవితం ఆదర్శంగా, ప్రేరణగా నిలుస్తోంది. తాజాగా భారత బిలినియర్, పారిశ్రామిక వేత్త..
Gautam Adani: ప్రతి ఒక్కరి జీవితానికి ఎవరో ఒకరు ప్రేరణగా నిలుస్తారు. ముఖ్యంగా జీవితంలో విజయాలను అందుకుని.. ఏ రంగంలో అయినా ఉన్నతస్థానానికి చేరుకున్న వ్యక్తులకు తప్పనిసరిగా ఎవరో ఒకరి జీవితం ఆదర్శంగా, ప్రేరణగా నిలుస్తోంది. తాజాగా భారత బిలినియర్, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ తన జీవితంలో ముందుకు సాగడానికి దేశంలోని ఇద్దరు అసాధారణ మహిళల జీవితమే ప్రేరణ అని చెప్పుకొచ్చారు. ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆ ఇద్దరు మహిళలు దేశానికి నిజమైన హీరోలంటూ ప్రశంసించారు. దేశంలోని సాధారణ ప్రజలతో పాటు, ఇద్దరు అసాధారణ మహిళల కథ తనను ఎక్కువగా ప్రేరేపించిందని అదానీ తెలిపారు. వారిద్దరూ నవభారతానికి నిజమైన హీరోలని సంబోధించారు. జీవితంలో ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందుతారని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. దేశంలోని సామాన్య మానవునికి సంబంధించిన అనేక లక్షణాలను తెలియజేస్తూ ఇద్దరు అసాధారణ మహిళల గురించి ఆయన ప్రస్తావిస్తూ.. భావోద్వేగానికి లోనయ్యారు. తాను ప్రేరణ పొందిన వారిలో అరుణిమా సిన్హా ఒకరైతే మరొకరు కిరణ్ కనోజియా అని చెప్పారు.
దురదృష్టవశాత్తు తమ అవయవాలను కోల్పోయిన ఇద్దరు అసాధారణ మహిళలు ప్రపంచాన్ని జయించారన్నారు. అరుణిమ సిన్హా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగా, బ్లేడ్ రన్నర్ కిరణ్ మారథాన్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇద్దరూ అపురూపమైన, అసాధారణమైన మహిళలని, వారు దేశానికి గర్వకారణమని అదానీ తెలిపారు.
ఈ ఇద్దరు మహిళలు న్యూ ఇండియాకు రియల్ హీరోలు అని గౌతమ్ అదానీ తెలిపారు. వారి జీవిత కథలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెబుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి ధైర్యం, పరాక్రమం, దృఢ సంకల్పం కంటే మరేదైనా స్ఫూర్తిదాయకంగా ఉంటుందా.. వారి గురించి తెలుసుకుంటే మనిషి కంటే శక్తిమంతమైన యంత్రం లేదన్న నమ్మకం మరింత బలపడిందని అదానీ తెలిపారు. అదే విధంగా భారతదేశంలోని సాధారణ వ్యక్తిగా, సగటు భారతీయుడి ధైర్యం, బలం, దృఢత్వం, తపస్సు తనకు చాలా స్ఫూర్తిదాయకమని, ఎంతో ప్రేరణనిచ్చాయని అదానీ అన్నారు. 2022 తనకు గొప్ప సంవత్సరం అని గౌతమ్ అదానీ తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..