Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savings: అప్పుల ఊబిలో కూరుకుపోయారా.. ఇప్పటికైనా ఇలా చేస్తే.. రుణ భారం తగ్గించుకోవచ్చు..

Savings: అప్పు అనేది ఎంత ప్రమాదమో చాలా మంది పెద్దలు చెబుతుంటారు. అప్పుల ఊబిలో కూరుకుంటే జీవితం నాశనమైనట్లే అని అంటుంటారు. ఓ రకంగా ఇది వాస్తవం కూడా. తీర్చే సామర్థ్యం ఉంటే ఎంత అప్పు చేసినా..

Savings: అప్పుల ఊబిలో కూరుకుపోయారా.. ఇప్పటికైనా ఇలా చేస్తే.. రుణ భారం తగ్గించుకోవచ్చు..
Saving
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 28, 2022 | 10:00 AM

Savings: అప్పు అనేది ఎంత ప్రమాదమో చాలా మంది పెద్దలు చెబుతుంటారు. అప్పుల ఊబిలో కూరుకుంటే జీవితం నాశనమైనట్లే అని అంటుంటారు. ఓ రకంగా ఇది వాస్తవం కూడా. తీర్చే సామర్థ్యం ఉంటే ఎంత అప్పు చేసినా పర్వాలేదు. కాని సామార్థ్యానికి మించి అప్పు చేస్తే మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. సాధారణంగా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో రుణ భారం పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు ఆదా చేయడం, అప్పు తీర్చడం రెండూ ముఖ్యమైనవే. కొన్ని సందర్భాల్లో ఊహించకుండా వచ్చే యాదృచ్ఛిక ఖర్చుల కోసం తప్పనిసరిగా అత్యవసర పొదుపు నిధిని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అత్యవసర పొదుపు నిధిని ఏర్పాటు చేసుకున్న తర్వాత.. అప్పులు చెల్లిస్తే.. భవిష్యత్తులో రుణ భారం పెరగకుండా ఉంటుందటున్నారు నిపుణులు.

అత్యవసర పొదుపు నిధి ఏర్పాటు చేసుకోకపోతే ఎంత సంపాదించినా ఆదాయం కన్పించదు. వడ్డీలు, అసలు చెల్లింపులతోనే సంపాదన ఖర్చు అయిపోతుంది. అప్పుల నుంచి బయటపడటం కూడా కష్టతరమవుతుంది. మొదట ఓ వ్యక్తి తన నికర ఆస్తుల విలువ ఎంతనేది తెలుసుకోవాలి. మొత్తం ఆస్తుల నుంచి అప్పులు తీసివేస్తే నికర విలువ వస్తుంది. కొంతమందికి ఎటువంటి ఆస్తులు ఉండవు. రుణం తీసుకుంటారు. అలాంటప్పుడు ఆర్థిక బాధ్యతలు మాత్రమే ఆ వ్యక్తికి ఉంటాయి. ఎక్కువ మంది తమకు అనుకోకుండా వచ్చే ఖర్చుల కోసం అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పులు తీర్చడం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ.. మరిన్ని రుణాలు చేయడాన్ని అలవాటు చేసుకుంటారు. అందుకే తొలుత ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత మొత్తాన్ని తీసి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా అప్పుల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.

అప్పుల బాధ ఎక్కువుగా ఉందని చాలా మంది చింతిస్తూ ఉంటారు. ఆ రుణాలు తీర్చడానికి తమ సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తారు. అప్పులు ఉన్నవారు కూడా కొద్ది నెలల పాటు ఓ అత్యవసర పొదుపు నిధిని ఏర్పాటు చేసుకున్న తర్వాత.. తమ రుణాలను చెల్లి్ంచాలి. అప్పులు చెల్లించే సమయంలో మధ్యలో ఏవైనా ఊహించని ఖర్చులు వస్తే రుణం వైపు వెళ్లకుండా.. అత్యవసర పొదుపు నిధిలో డబ్బులు తీసి ఖర్చు చేయడం ద్వారా అప్పుల వైపు మళ్లకుండా ఉండొచ్చు. ఇలా చేయడం ద్వారా ఇప్పటికే ఉన్న రుణాలు తీరిపోయిన తర్వాత అప్పులు లేకుండా రుణ రహితంగా మారి.. ప్రశాంత జీవనం గడపవచ్చంటున్నారు నిపుణులు. అత్యవసర పొదుపు నిధిని మన స్థోమత, సంపాదన, ఆర్థిక సామర్థ్యం మేరకు ఏర్పాటు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..