- Telugu News Photo Gallery Royal enfield second hand bike available at just Rs 70000 in droom website, here is the detail
Royal Enfield: బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను రూ. 70 వేలకే సొంతం చేసుకోవచ్చు!
ప్రస్తుతం కొత్త బైక్‌లు కొనాలంటే.. బడ్జెట్ చాలా హెవీ అయిపోతుంది. లక్షలు ఖర్చు అవుతుంది. అయితే సెకండ్ హ్యాండ్ బైక్ కోసం చూస్తుంటే..
Updated on: Dec 29, 2022 | 8:30 AM

ప్రస్తుతం కొత్త బైక్‌లు కొనాలంటే.. బడ్జెట్ చాలా హెవీ అయిపోతుంది. లక్షలు ఖర్చు అవుతుంది. అయితే సెకండ్ హ్యాండ్ బైక్ కోసం చూస్తుంటే.. ఇది మీకోసమే.. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను రూ. 70 వేలకే మీరు సొంతం చేసుకోవచ్చు.

పాత వాహనాలను విక్రయించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ 'డ్రూమ్'(Droom)లో రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350 సిసి మోడల్ సెకండ్ హ్యాండ్‌లో అందుబాటులో ఉంది. కేవలం 70 వేల రూపాయలకే లభిస్తుంది.

డ్రూమ్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, నోయిడా లొకేషన్‌లో UP నెంబర్ ప్లేట్‌తో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అమ్మకానికి అందుబాటులో ఉంది.

ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ సుమారు 20 వేలకు పైగా కిలోమీటర్లు ప్రయాణించింది. 2015 రిజిస్ట్రేషన్‌తో.. 20 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా ఈ బైక్‌కు ఉంది.

కాగా, ఈ మధ్యకాలంలో మోసాలు ఎక్కువైపోతుండటంతో.. సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నప్పుడు.. మీరు సదరు బైక్ యజమానిని కలిసి.. బైక్ కండిషన్, డాక్యుమెంట్‌లను వెరిఫై చేయడం తప్పనిసరి. అన్నీ క్లియర్‌గా, కచ్చితంగా ఉన్న తర్వాతే లావాదేవీలు పూర్తి చేయాలి.(https://droom.in/product/royal-enfield-thunderbird-350cc-2015-6118908646883aca088b4be5)




