Eclipses: 2023 సంవత్సరంలో ఎన్ని సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించనున్నాయి..? పూర్తి వివరాలు

మరో మూడు రోజుల్లో 2022 సంవత్సరానికి వీడ్కోలు పలికి.. 2023 సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాము. అయితే ప్రతి ఏడాది సూర్య గ్రహణాలు, చంద్రగ్రణాలు సంభవిస్తుంటారు. ఇలాంటి గ్రహణాలపై..

Eclipses: 2023 సంవత్సరంలో ఎన్ని సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించనున్నాయి..? పూర్తి వివరాలు
Eclipses
Follow us
Subhash Goud

|

Updated on: Dec 28, 2022 | 6:27 PM

మరో మూడు రోజుల్లో 2022 సంవత్సరానికి వీడ్కోలు పలికి.. 2023 సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాము. అయితే ప్రతి ఏడాది సూర్య గ్రహణాలు, చంద్రగ్రణాలు సంభవిస్తుంటారు. ఇలాంటి గ్రహణాలపై అందరు దృష్టి సారిస్తుంటారు. వాటి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు ఏడాదిలో ఎప్పుడు, ఏ సమయంలో సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తుంటాయో తెలుసుకుంటారు. ఈ ఏడాది కూడా గ్రహణాలు సంభవించనున్నాయి. భారతదేశంలో ఎన్ని గ్రహణాలు కనిపిస్తాయో అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో జ్యోతిషశాస్త్ర వివరాల ప్రకారం.. 2023 సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు, ఎప్పుడు ఏర్పడతాయో తెలుసుకుందాం. వచ్చే ఏడాదిలో వచ్చే భారతదేశంలో 4 గ్రహణాలు సంభవించనున్నాయి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు.

  1. మొదటి గ్రహణం: 2023లో ఏప్రిల్‌లో తొలి గ్రహణం ఏర్పడనుంది. మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్‌ 20, 2023 గురువారం రోజున ఏర్పడనుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 20 ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.29 వరకు కొనసాగుతుంది. జ్యోతిష్యం ప్రకారం.. భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు.
  2. రెండవ గ్రహణం: 2023 సంవత్సరంలో రెండవ గ్రహణం మే 5, 2023 శుక్రవారం నాడు ఏర్పడుతుంది. ఈ ఏడాదిలో ఇదే తొలి చంద్రగ్రహణం. రాత్రి 8.45 గంటలకు గ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1 గంటలకు ముగుస్తుంది.
  3. మూడవ గ్రహణం: 2023 సంవత్సరంలో మూడవ సూర్యగ్రహణం అక్టోబర్ 14న శనివారం ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో ఇది రెండవ సూర్యగ్రహణం అవుతుంది. తొలి సూర్యగ్రహణం మాదిరిగానే ఈ గ్రహణం కూడా భారతదేశంలో కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటికా, ఆర్కిటిక్‌లలో కనిపిస్తుంది.
  4. నాలుగో గ్రహణం: చంద్రగ్రహణం 2023 సంవత్సరంలో చివరి గ్రహణం. అక్టోబర్ 29 ఆదివారం నాడు ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం ఉదయం 1.06 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.22 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు జ్యోతిష నిపుణులు, శాస్త్రవేత్తల వివరాల ప్రకారం అందించడం జరుగుతుంది. వీటిని టీవీ9 ధృవీకరించడం లేదు. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?