Diabetes: ఏ వయసులో ఎంత షుగర్ లెవెల్ ఉండాలి..? డయాబెటిస్‌ పెరిగితే ఎలా కంట్రోల్‌ చేయాలి?

నేటి కాలంలో వ్యాధులకు వయస్సు లేదు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వ్యాధులు వ్యాపిస్తున్నాయి. మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మీ శరీరంలో సకాలంలో జరుగుతున్న..

Diabetes: ఏ వయసులో ఎంత షుగర్ లెవెల్ ఉండాలి..? డయాబెటిస్‌ పెరిగితే ఎలా కంట్రోల్‌ చేయాలి?
Follow us
Subhash Goud

|

Updated on: Dec 27, 2022 | 8:50 PM

నేటి కాలంలో వ్యాధులకు వయస్సు లేదు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వ్యాధులు వ్యాపిస్తున్నాయి. మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మీ శరీరంలో సకాలంలో జరుగుతున్న మార్పులను మీరు గమనించినట్లయితే వ్యాధులు రాకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. నేటి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. వృద్ధులే కాదు చిన్నారులు కూడా వీటి బారిన పడుతున్నారు. ఇందులో ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవడం అవసరం అవుతుంది. మరి ఏ వయసులో బ్లడ్ షుగర్ లెవెల్ ఉండాలి అనేది షుగర్ లెవెల్ చార్ట్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.

వయస్సు ప్రకారం చక్కెర స్థాయి

ప్రతి వయస్సులో చక్కెర స్థాయి మారుతూ ఉంటుంది. దీని కారణంగా, నిర్దేశించిన స్థాయి కంటే ఎక్కువ లేదా అంతకంటే తక్కువ ఉంటే ఆరోగ్యం క్షీణిస్తుంది. అందుకే ఇప్పుడున్న కాలంలో జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు.

  • 0-5 సంవత్సరాల పిల్లలలో దీని ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. వారి చక్కెర స్థాయి 110 నుండి 200 mg/dL వరకు ఉంటుంది
  • 6-12 సంవత్సరాల వయస్సు పిల్లలకు 100 నుండి 180 mg/dL వరకు చక్కెర స్థాయి ఉండాలి
  • 13-18 సంవత్సరాల మధ్య అంటే టీనేజ్ రక్తంలో చక్కెర 90 నుండి 150 mg/dL ఉంటే మంచిది
  • 18 ఏళ్ల యువతలో తిన్న తర్వాత చక్కెర స్థాయి 140 mg/dL, కానీ అది ఖాళీ కడుపుతో 99 mg/dL వరకు ఉంటే అది సరైనది భావించాలి.
  • మధుమేహం వచ్చే ప్రమాదం 40 ఏళ్ల తర్వాత ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చక్కెర స్థాయి ఖాళీ కడుపుతో 90 నుండి 130 mg/dL, తిన్న తర్వాత 140 నుండి 150 mg/dL వరకు ఉంటుంది.

షుగర్ పెరిగితే ఎలా నియంత్రించాలి..?

ఈ రోజుల్లో మధుమేహం ఉన్నవారికి షుగర్ లెవెల్ పెరగడం సర్వసాధారణమైపోయింది. అటువంటి పరిస్థితిలో మీ చక్కెర స్థాయి కూడా సూచించిన మొత్తం కంటే ఎక్కువగా ఉంటే అది కొన్ని మార్గాల్లో నియంత్రించబడుతుంది. అన్నింటిలో మొదటిది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నడవడం ప్రారంభించాలి. వెంటనే స్వీట్లు లేదా స్టార్చ్ లేదా కార్బోహైడ్రేట్లను కలిగి ఉన్న వాటిని తినడం మానేయండి. వీలైనంత వరకు మీ ఆహారంలో సలాడ్‌ను చేర్చండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి