AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nothing Phone 1: నథింగ్ ఫోన్ 1 పై భారీ డిస్కౌంట్.. ఇయర్ ఎండ్ సేల్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. వివరాలివే..

Nothing Phone 1: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ నథింగ్ వారి ‘నథింగ్ ఫోన్ 1’ ధర భారీగా తగ్గింది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ. 25,199 గా ఉండడంతో..

Nothing Phone 1: నథింగ్ ఫోన్ 1 పై భారీ డిస్కౌంట్.. ఇయర్ ఎండ్ సేల్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. వివరాలివే..
Nothing Phone 1
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 28, 2022 | 10:03 PM

Share

Nothing Phone 1: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ నథింగ్ వారి ‘నథింగ్ ఫోన్ 1’ ధర భారీగా తగ్గింది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ. 25,199 గా ఉండడంతో అందరికీ అందుబాటులో ఉన్నట్లయింది. ఇయర్ ఎండ్ సేల్‌ను నిర్వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్ 2022 సంవత్సరంలో విడుదలైన అనేక కంపెనీల ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అలా భారీగా ధర తగ్గిన ఫోన్లలో నథింగ్ ఫోన్ 1 కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ధర, దాని ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

నథింగ్ ఫోన్ 1 వివరాలు: ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్ ఎండ్ సేల్‌ ధరల ప్రకారం నథింగ్ ఫోన్ 1 (8GB RAM + 128GB) మోడల్ 27,999 రూపాయలకు అందుబాటులో ఉంది. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 32,999గా ఉండగా దీనిపై రూ. 5,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. ఈ బ్యాంక్ కార్డ్‌పై దాదాపు రూ. 2,800 డిస్కౌంట్ పొందవచ్చు.

5G సేవలను అందించగల నథింగ్ ఫోన్ 1 ఫోన్‌లో మీరు గ్రాఫికల్ గేమ్స్ కూడా ఆడవచ్చు. మల్టీ-టాస్కింగ్ సమస్య లేనే లేదు ఈ ఫోన్‌లో. ఇంటెన్సివ్ వర్క్‌లోడ్‌ను కూడా హ్యాండిల్ చేయగల హార్డ్‌కోర్ పర్ఫార్మెన్స్‌ను నథింగ్ ఫోన్ 1 కలిగి ఉంది. 120Hz డిస్‌ప్లే, క్లీన్ (బ్లోట్‌వేర్-ప్రీ) సాఫ్ట్‌వేర్‌తో ఉన్న నథింగ్ ఫోన్ 1 బ్యాటరీ లైఫ్ సుదీర్ఘ కాలం వచ్చేలా ఉంటుంది. ప్రత్యేకమైన లైట్, సౌండ్ సెటప్, ఫోన్ నోటిఫికేషన్‌లను ఈ ఫోన్ ద్వారా పొందవచ్చు. ఇదే ధరతో ఉన్న ఇతర ఫోన్‌ల కంటే ఈ ఫోన్ కెమెరా మెరుగ్గా ఉంది. బెస్ట్ కెమెరా, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ ఫోన్ మేలైనదని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్