Prank Went Wrong: విద్యార్థుల కొంపముంచిన ప్రాంక్.. దండం పెట్టినా అమ్మాయిలు వినరే.. చివరకు ఏమయ్యిందంటే..?

ఒడిశాకు చెందిన కాలేజీ విద్యార్థులు వారితో పాటు చదువుకుంటున్న విద్యార్థినులపై  చేసిన ప్రాంక్ వీడియో వారి కొంపముంచింది. సోషల్ మీడియాలోని ప్రాంక్ వీడియోలు నిజమైనవే అనుకున్న ఆ విద్యార్థులు..

Prank Went Wrong: విద్యార్థుల కొంపముంచిన ప్రాంక్.. దండం పెట్టినా అమ్మాయిలు వినరే.. చివరకు ఏమయ్యిందంటే..?
Boys Punished For Playing Prank With Girls
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 28, 2022 | 7:15 PM

ఒడిశాకు చెందిన కాలేజీ విద్యార్థులు వారితో పాటు చదువుకుంటున్న విద్యార్థినులపై  చేసిన ప్రాంక్ వీడియో వారి కొంపముంచింది. సోషల్ మీడియాలోని ప్రాంక్ వీడియోలు నిజమైనవే అనుకున్న ఆ విద్యార్థులు.. అమ్మాయిలకు చెప్పకుండానే ప్రాంక్ చేశారు. దీంతో ఆగ్రహించిన అమ్మాయిలు ఆ విద్యార్థులపై మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. నిమ్మపాడ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులపై విద్యార్థినులు అరవడాన్ని మనం చూడవచ్చు.

వారు చేసిన ప్రాంక్ తప్పేనంటూ విద్యార్థులు ఆ అమ్మాయిలకు దండం పెట్టి వేడుకోవడాన్ని మనం చూడవచ్చు. అయినా ఆపకుండా తిడుతున్న అమ్మాయిలను అక్కడున్న తోటి విద్యార్థులు సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వారు ఆగకుండా ఆ ఇద్దరు విద్యార్థులను తిడుతూనే ఉన్నారు.  మరి చివరకు ఏమయిందో తెలియరాలేదు కానీ ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘పాపం అబ్బాయిలు’ అని కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..

కాగా, సోషల్ మీడియాలో పోస్ట్ అయిన అనేక ప్రాంక్ వీడియోలను చూస్తునే ఉంటాం.  అవి నిజానికి ప్రాంక్ వీడియోలు కాదు. ప్రాంక్ చేసేవారు, ఫూల్ అయ్యేవారు ముందుగానే మాట్లాడుకుని వీడియోను షూట్ చేస్తారు. అందుకోసం పెద్ద తతంగమే నడుస్తుంది. అయితే మనకు మాత్రం నిజమైన ప్రాంక్ వీడియోనే అన్నట్లుగా అనిపిస్తుంది. ఈ ప్రాంక్ వీడియోలు నిజం కాదని తెలిసిన కొందరు నెటిజన్లు వీటితో విసుగెత్తిపోతుంటారు. మరికొందరు ఇవి నిజం కాదని తెలిసినా చూసి ఆనందిస్తుంటారు. ఇంకొందరు ఇవి  నిజంగా చేసినవేమోననే భ్రాంతిలో గుడ్డిగా నమ్మేస్తుంటారు. అయితే ప్రాంక్ చేసిన కొన్ని సందర్భాలలో అవి గొడవలకు కూడా దారి తీస్తాయి. ప్రాంక్ ద్వారా ఫూల్ అయ్యే వ్యక్తి సమ్మతి పొందకుండా లేదా చెప్పకుండా ప్రాంక్ చేయడం వల్ల ఘర్షణలు జరిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు కూడా జరిగింది.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం క్లిక్ చేయండి..