Raja Singh: నూతన సంవత్సర వేడుకలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్.. ఆయన ఏమన్నారంటే..

మరో మూడు రోజులతో జరుపుకోనున్న నూతన సంవత్సర వేడుకల కోసం తెలంగాణ యువత సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేవారిని ‘సమాజాన్ని తప్పుదోవ పట్టించే వ్యక్తులు’గా రాజాసింగ్ అభివర్ణించారు. డిసెంబర్ 27న ఆయన విడుదల చేసిన వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ప్రతిరోజూ కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. డిసెంబర్ 31న ప్రారంభించే ఈ నూతన సంవత్సర వేడుకలు మన భారతీయ […]

Raja Singh: నూతన సంవత్సర వేడుకలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్.. ఆయన ఏమన్నారంటే..
Raja Singh On New Year Celebrations
Follow us

|

Updated on: Dec 28, 2022 | 5:12 PM

మరో మూడు రోజులతో జరుపుకోనున్న నూతన సంవత్సర వేడుకల కోసం తెలంగాణ యువత సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేవారిని ‘సమాజాన్ని తప్పుదోవ పట్టించే వ్యక్తులు’గా రాజాసింగ్ అభివర్ణించారు. డిసెంబర్ 27న ఆయన విడుదల చేసిన వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ప్రతిరోజూ కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. డిసెంబర్ 31న ప్రారంభించే ఈ నూతన సంవత్సర వేడుకలు మన భారతీయ సంస్కృతి కానే కాదు. పాశ్చాత్య సంస్కృతి అని గుర్తుంచుకోండి. 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించినవారి సంస్కృతి ఇది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల సమయంలో దుష్టశక్తులకు ఆవహించినట్లుగా ప్రజలు వేడుకల్లోకి పిచ్చిగా దిగుతారు. మన కొత్త సంవత్సరం ఉగాది నాడే ప్రారంభమవుతుంది” అని అన్నారు.

జనవరి 1న ఘనంగా జరుపుకునే నూతన సంవత్సర వేడుకలను పెద్ద ఎత్తున విమర్శించిన రాజాసింగ్..ఈ ఈ పాశ్చాత్య సంస్కృతిని అంతం చేయడానికి దేశంలోని యువత చేతులు కలపాలని కోరారు. యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం మనది కాదనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే.. పాశ్యత్య సంస్కృతికి స్వస్తి చెప్పవచ్చని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Latest Articles