Climbing Steps: మెట్లు ఎక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..? తెలిస్తే లిఫ్ట్ వైపు చూడనే చూడరు..

ఆరోగ్యం మీద అవగాహన పెంచుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి మెట్లు ఎక్కడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేమిటో మీకు తెలుసా..? ఎలివేటర్లో వెళ్ళడం కంటే మెట్లు ఎక్కి వెళ్లడం వల్ల..

Climbing Steps: మెట్లు ఎక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..? తెలిస్తే లిఫ్ట్ వైపు చూడనే చూడరు..
Health Benefits Of Climbing Stairs
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 27, 2022 | 4:12 PM

ఎలివేటర్లు ఉంటే మనం సాధారణంగానే మెట్లు ఎక్కేందుకు ఇష్టపడం. మెట్లు ఎక్కడం కంటే లిఫ్ట్ అయితే వెంటనే వెళ్లవచ్చని, శ్రమ పడనవసరంలేదనే భావనలు ప్రధాన కారణాలు అయితే బద్దకం కూడా మరో కారణం. అభివృద్ధి చెందిన టెక్నాలజీ కారణంగా ప్రస్తుత కాలంలో మానవుడు బద్దకస్తుడిగా మారుతున్నాడు. శరీరారోగ్యం కోసం కనీస ప్రయత్నాలు కూడా చేయకుండా టెక్నాలజీ మాయలో పడి అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అటువంటి జీవిన విధానం వల్లనే మానవుడు అనునిత్యం బాధపడుతున్నాడు. అయితే ఆరోగ్యం మీద అవగాహన పెంచుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి మెట్లు ఎక్కడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేమిటో మీకు తెలుసా..? ఎలివేటర్లో వెళ్ళడం కంటే మెట్లు ఎక్కి వెళ్లడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

మెట్లు ఎక్కడం అనేది అన్ని రకాల వ్యాయామాల కంటే అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. తాజా అధ్యయనాల ప్రకారం క్యాలరీలను కరిగించాలనుకునేవారు మెట్లు ఎక్కితే సరిపోతుందని తాజా ఆధ్యయనాలు చెబుతున్నాయి. జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, టెన్నీస్ వంటి వ్యాయామాల కంటే మెట్లు ఎక్కడం వల్లనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయంట. అసలు ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్లు ఎక్కడం వల్ల వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గుండె, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది ఒక సురక్షితమైన మార్గం, వ్యాయామం. ఊరిపితిత్తులు ఆక్సిజన్‌ను మరింత వేగవంతంగా తీసుకోవడానికి, గుండె ఆరోగ్యంగా ఉండడానికి మెట్లు ఎక్కితే సరి. అంతేకాక ఇలా చేయడం వల్ల శరీర రక్తప్రసరణ వేగవంతమై ఉత్సాహాంగా, ఫీల్ బెటర్‌గా ఉంటాం. మెట్లను ఎక్కి వెళ్లడం ద్వారా మీ ఆయుర్దాయాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇంకా బరువు తగ్గడంలో, కాలరీలను కరిగించడంలో ఇది సహాయపడుతుంది. శారీరక దారుఢ్యం కోసం ఎటువంటి ఖర్చు లేకుండా, ఫీజులు చెల్లించే అవసరం లేకుండానే మెట్లు ఎక్కితే సరిపోతుంది. మెట్లను ఎక్కడం వల్ల మీ శరీర కండరాలకు తగినంత శక్తి లభించి అవి బలోపేతం అవుతాయి. ఇంకా మీ మానసిక ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..