Isha Ambani Twins: బిడ్డలొచ్చిన వేళ బంగారమొక లెక్కా..? కవలలకు గ్రాండ్ వెల్‌కమ్ ఇస్తూ ఎంత గోల్డ్ దానం చేస్తున్నారో తెలిస్తే నోరెల్లబెట్టాల్సిందే..

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గారాలపట్టి ఈషా అంబానీ నవంబర్ నెలలో కవలలకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ ఆసుపత్రిలో ఒకే కాన్పులో

Isha Ambani Twins: బిడ్డలొచ్చిన వేళ బంగారమొక లెక్కా..? కవలలకు గ్రాండ్ వెల్‌కమ్ ఇస్తూ ఎంత గోల్డ్ దానం చేస్తున్నారో తెలిస్తే నోరెల్లబెట్టాల్సిందే..
Mukesh Nita Ambani, Anand Piramil And His Wife Isha
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 26, 2022 | 6:54 PM

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గారాలపట్టి ఈషా అంబానీ నవంబర్ నెలలో కవలలకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ ఆసుపత్రిలో ఒకే కాన్పులో పాప, బాబులకు జన్మనిచ్చిన ఈషా ఆ తర్వాత మొదటిసారిగా శనివారం ముంబైకి చేరుకున్నారు. కూతురు, మనవళ్లకు అంబానీ, పిరామల్ కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సంతోషకర సమయంలో అంబానీ కుటుంబం వినూత్న నిర్ణయం తీసుకుంది. తన కుమార్తెకు పుట్టిన కవలలు ఇంటికి వచ్చిన నేపథ్యంలో ముకేశ్ అంబానీ 300 కిలోల బంగారాన్ని దానం చేయడంతో పాటు ఐదు అనాథ శరణాలయాలను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతకుముందు ఈషా, తన కవలలకు ఆహ్వానం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసిన ముఖేశ్ కుటుంబం.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల నుంచి అర్చకులను రప్పించింది. కాలిఫోర్నియాలో ఈషా కవలలకు జన్మనిచ్చిన వెంటనే ముంబయి నుంచి ప్రత్యేక వైద్యుల బృందాన్ని ముఖేష్ అమెరికాకు పంపారు. అక్కడ ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ గిబ్సన్.. ఈషా కవల చిన్నారులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

అనంతరం ఈషా ముంబైకి రానున్న క్రమంలో చిన్నారులకు మొదటి విమాన ప్రయాణం కావడంతో డాక్టర్ గిబ్సన్ కూడా ఈషాతో కలిసి ముంబైకి చేరుకున్నారు. ప్రత్యేకంగా చెప్పుకోవలసిన మరో విషేషమేమంటే..  తన కవలల సంరక్షణ, ఆలనపాలన చూసుకోడానికి ప్రత్యేక శిక్షణ పొందిన 8 మంది అమెరికన్ ఆయాలను ఈషా తీసుకొచ్చారు. వీరు ఇక్కడే ఉండి శిశువుల సంరక్షణను చూసుకుంటారు. ఈషాకు జన్మించిన ఈ కవలల్లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కాగా.. అమ్మాయికి ఆదియా అని, అబ్బాయికి కృష్ణా అని నామకరణం చేసినట్లు అంబానీ కుటుంబం తెలిపింది. ముకేశ్ తనయుడు ఆకాశ్ అంబానీకి గతంలో ఓ కుమారుడు జన్మించారు. దీంతో ముకేశ్ రెండోసారి తాత అయినట్టయ్యింది. ముఖేశ్ అంబానీకి ముగ్గురు సంతానం కాగా ఆకాశ్, ఇషాలు(31) కవలలు, కుమారుడు అనంత్ (27).

ఇవి కూడా చదవండి

ఈషా, ఆనంద్ పిరామాల్ దంపతులు పిల్లలతో కలిసి పూజలు నిర్వహిస్తారు. వారి కోసం దేశవ్యాప్తంగా ఉన్న పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరుపతి శ్రీవారి ఆలయం, నాథద్వారాలోని శ్రీనాథ్ ఆలయం, శ్రీ ద్వారకాధీష్ ఆలయం సహా ప్రముఖ దేవాలయాలలో ప్రత్యేక ప్రసాదం కూడా పంపిణీ చేస్తారు. కాగా, చిన్ననాటి స్నేహితులైన ఈషా అంబానీ-ఆనంద్ పిరామల్‌కు 2018లో వివాహం జరిగింది. ఆనంద్ పిరామాల్ ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ పిరామాల్-స్వాతి పిరామాల్ దంపతుల కుమారుడు. పిరామాల్ గ్రూప్ తరఫున ఫార్మా, హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్ సహా పలు వ్యాపారాలను ఆనంద్ నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ