Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan-PM Modi Meet: ఈ నెల 28న ప్రధానితో భేటీ కానున్న సీఎం జగన్..? పాలనా – రాజకీయ వ్యవహారాలే అజెండా..

భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 28న దేశ రాజధానికి వెళ్లనున్నారు. డిసెంబర్ 5న ఢిల్లీలో ఏర్పాటు చేసిన జీ20..

CM Jagan-PM Modi Meet: ఈ నెల 28న ప్రధానితో భేటీ కానున్న సీఎం జగన్..? పాలనా - రాజకీయ వ్యవహారాలే అజెండా..
Cm Jagan Likely To Meet Pm Modi On December 28
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 26, 2022 | 3:08 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 28న దేశ రాజధానికి వెళ్లనున్నారు. డిసెంబర్ 5న ఢిల్లీలో ఏర్పాటు చేసిన జీ20 సన్నాహక కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ నాయకులతో పాటు సీఎం జగన్ కూడా ప్రధాని మోదీని కలిశారు. ఆ కార్యక్రమం జరిగిన నెలలోపులోనే  ప్రధానిని కలిసేందుకు జగన్ ఢిల్లీ వెళ్లడంపై సర్వత్రా చర్చనీయాంశమయింది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం 28న ప్రధానితో జగన్ సమావేశాన్ని అధికారికంగా ధృవీకరించనప్పటికీ, ఇది నిజమేనంటూ వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆయన మంగళవారం సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి, బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి ప్రస్తుతం తన సొంత జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు క్రిస్మస్ ప్రార్థన సేవల్లో పాల్గొంటున్నారు.

అయితే సీఎం జగన్ ఈ సమావేశం నేపథ్యంలో ప్రధానితో పలు అంశాలపై చర్చిస్తారని సమాచారం. అందులో భాగంగానే 2023 జనవరి రెండు లేదా మూడో వారంలో ప్రణాళికాబద్ధంగా కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయాలని ప్రధానిని ముఖ్యమంత్రి కోరతారు. కడప ఉక్కు కర్మాగారం 2014 రాష్ట్ర విభజన చట్టంలో భాగమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిని చొరవగా స్వీకరించింది. రూ.8,800 కోట్లతో నిర్మించే కడప ఉక్కు కర్మాగారాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిందాల్ గ్రూపునకు ఇచ్చింది. రాయమపట్నంలో స్టీల్‌ ప్లాంట్‌, ఓడరేవుకు నిధులు మంజూరు చేయాలన్న తన అభ్యర్థనను కూడా ముఖ్యమంత్రి మళ్లీ సమర్పించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉన్నందున, ఇద్దరు నేతలు ఏదో ఒక రాజకీయ చర్చలో నిమగ్నమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కేంద్రమంత్రులతోనూ భేటీ..?

సీఎం జగన్  ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మంత్రుల అపాయింట్‌మెంట్స్ ప్రకారం వారికి కుదిరిన సమయంలో జగన్ భేటీ కానున్నారు. అయితే ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలపై అటు ఆయా శాఖల కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. కాగా ఇప్పటికే పలుసార్లు ప్రధానితో భేటీ అయిన సీఎం జగన్ ఈసారి భేటీపై ప్రాధాన్యత చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

పథకాలకు నిధులే ప్రధాన అజెండా..

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలనా పరంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను సీఎం జగన్ ప్రధాని వద్ద చర్చించి ఆమోదం తీసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలు సార్లు నివేదించిన పోలవరం సవరించిన అంచనాలు ప్రధాన అజెండాగా ఉంది. ముందస్తు నిధుల కేటాయింపులో భాగంగా ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే విధంగా ప్రధానితో సీఎం చర్చించనున్నారు. దీంతో పాటుగా ఏపీలో మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన ప్రధానితో చేయించాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు.. అమలు చేయాల్సిన హామీలపైనా చర్చించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ దేశపు పాస్‌పోర్ట్‌ ఉపయోగించి.. గోల్డ్‌ స్మగ్లింగ్‌
ఆ దేశపు పాస్‌పోర్ట్‌ ఉపయోగించి.. గోల్డ్‌ స్మగ్లింగ్‌
IPL vs WPL ప్రైజ్ మనీ మధ్య అంత భారీ తేడా ఎందుకు?
IPL vs WPL ప్రైజ్ మనీ మధ్య అంత భారీ తేడా ఎందుకు?
శ్రీదేవితో పెళ్లి ఆఫర్.. కుదరదు అని చెప్పిన నటుడు..
శ్రీదేవితో పెళ్లి ఆఫర్.. కుదరదు అని చెప్పిన నటుడు..
అందంతో చంపేస్తున్న శోభా శెట్టి.. చూపు తిప్పుకోవడం కష్టమే
అందంతో చంపేస్తున్న శోభా శెట్టి.. చూపు తిప్పుకోవడం కష్టమే
యాక్షన్ కింగ్ అర్జున్ చేతిలో ఉన్న ఈ పిల్లోడిని గుర్తు పట్టారా?
యాక్షన్ కింగ్ అర్జున్ చేతిలో ఉన్న ఈ పిల్లోడిని గుర్తు పట్టారా?
వేడి కాఫీ లేదా కోల్డ్ కాఫీ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?
వేడి కాఫీ లేదా కోల్డ్ కాఫీ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?
అసెంబ్లీలో దుమ్ముదుమారమే.. సభ ముందుకు రెండు చారిత్రాత్మక బిల్లులు
అసెంబ్లీలో దుమ్ముదుమారమే.. సభ ముందుకు రెండు చారిత్రాత్మక బిల్లులు
IPL 2025: వామ్మో ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటి భయ్యా ఇంత భయంకరంగా ఉంది!
IPL 2025: వామ్మో ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటి భయ్యా ఇంత భయంకరంగా ఉంది!
కౌలుభూమిపై కన్నేసి.. తాగే నీళ్లలో పురుగు మందు కలిపి రైతు హత్య!
కౌలుభూమిపై కన్నేసి.. తాగే నీళ్లలో పురుగు మందు కలిపి రైతు హత్య!
నేడు అప్పు జయంతి నీవు లేవు నీ దారిని విడవం అంటున్న ఫ్యాన్స్..
నేడు అప్పు జయంతి నీవు లేవు నీ దారిని విడవం అంటున్న ఫ్యాన్స్..