AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemon Peel Benefits: నిమ్మకాయ తొక్కే కదా అని నెట్టేస్తున్నారా..? దాని ప్రయోజనాలేమిటో తెలిస్తే తప్పక నోరెల్లబెట్టాల్సిందే..

నిమ్మకాయలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయని, విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుందని మాత్రమే మనకు తెలుసు. ఇక నిమ్మకాయ తొక్కలతో ఎటువంటి ప్రయోజనం ఉండదనుకుంటాం కానీ..

Lemon Peel Benefits: నిమ్మకాయ తొక్కే కదా అని నెట్టేస్తున్నారా..? దాని ప్రయోజనాలేమిటో తెలిస్తే తప్పక నోరెల్లబెట్టాల్సిందే..
విటమిన్ సీ అధికంగా ఉండే నిమ్మకాయ, నారింజ, కమల, బత్తాయి ఫలాలు శరీరంలో తెల్ల రక్తకణాలు ఉత్పత్తిని పెంపొందిస్తాయి. అలాగే జలుబును నివారించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 24, 2022 | 12:36 PM

Share

చదవేస్తే ఉన్న మతి పోయినట్లు’ అన్న సామెతను మీరు వినే ఉంటారు. నిజంగా ప్రస్తుత మానవ ప్రపంచం అవలంభిస్తున్న జీవన విధానాలకు సరిగ్గా సరిపోయే మాట అది. ఫ్యాషన్, డైటింగ్స్ అంటూ ఆహారపు అలవాట్లను మార్చుకున్న మనం ఏది మన ఆరోగ్యానికి శ్రేయస్కరమో, ఏది ప్రయోజనరాహిత్యమో తెలుసుకోలేని దశకు చేరుకుంటున్నాం. అవును.. ఈ మాటలు అక్షర సత్యాలు. నిమ్మకాయ తొక్కలోని ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా ఇదే నిర్ణయానికి వస్తారు. మనం సాధారణంగా నిమ్మకాయలను వాడిన తర్వాత దాని తొక్కలను పడేస్తూ ఉంటాం. తొక్కే కదా అనే భావనతో మనం దానిని  లైట్ తీసుకుంటాం. నిమ్మకాయలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయని, విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుందని మాత్రమే మనకు తెలుసు. ఇక నిమ్మకాయ తొక్కలతో ఎటువంటి ప్రయోజనం ఉండదనుకుంటాం కానీ నిమ్మకాయ తొక్కలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా మనం వాటిని ఉపయోగించకుండా ఉండలేం. అంతేనా.. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని పారేయడానికి ఇష్టపడం. అయితే నిమ్మకాయ తొక్కలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..? అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నిమ్మ తొక్కలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

నిమ్మకాయ తొక్కలలో శక్తివంతమైన బయో యాక్టివ్ కాంపౌండ్స్‌తో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సీ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఇంకా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇక నిమ్మతొక్కలలో ఉండే డీలైమొనెన్ గుండెజబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నిమ్మతొక్కలు క్యాన్సర్ వ్యాధిని నయం చేయడంలోనూ ఉపయోగపడతాయి. నిమ్మతోక్కల పొడి శరీర సౌందర్యాన్ని పెంచే స్క్రబ్‌గా కూడా ఉపకరిస్తుంది.

చర్మ సమస్యలకు పరిష్కారం:

నిమ్మ తొక్కలతో ఎన్నో చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకోసం ఎండబెట్టిన నిమ్మ తొక్కలను పొడిగా చేసి, తేనెతో కలుపుకోవాలి. దానిని ముఖానికి అప్లై చేస్తే ముఖం పైన ముడతలు, మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. నిమ్మ తొక్కలను నేరుగా ముఖానికి అప్లై చేస్తే డార్క్ స్పాట్స్, ముడుతలు, ఇతర చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఎండబెట్టిన నిమ్మ తొక్కల పొడిని గ్రీన్ టీ, హెర్బల్ టీలో కలుపుకొని తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మ తొక్కల పొడిని కొంచెం వంట సోడా, ఉప్పు కలిపి పళ్ళు తోముకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉండడమేకాక తెల్లగా మెరుస్తాయి.

ఇవి కూడా చదవండి

చెడు కొలెస్ట్రాల్ కు చెక్, స్ట్రెస్ రిలీఫ్:

నిమ్మ తొక్కలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.  అంతేకాక కడుపు ఉబ్బరాన్ని, అధిక బరువును తగ్గించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మ తొక్క లో ఉండే పెక్టిన్ వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నిమ్మ తొక్కను వాసన చూస్తే ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. నిమ్మ తొక్కలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల అది మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. గాల్ బ్లాడర్‌లో ఏర్పడే రాళ్ళు పోవడానికి కూడా నిమ్మతొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే నిమ్మ తొక్కలను పడేయకుండా వాటిని పొడి చేసుకుని పెట్టుకుంటే అది వివిధ రకాలుగా మనకు ఆరోగ్యాన్ని తెచ్చి పెడుతుంది.

మరిన్ని లైఫ్ ‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..