Health Tips: రాత్రివేళల్లో మీకు తొందరగా నిద్ర పట్టడం లేదా..? అయితే మీ కోసమే ఈ విలువైన సమాచారం..

నిద్రలేమి సమస్యకు కారణాలు ఏవైనా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పు చేస్తే సరిపోతుంది. మరి నిద్రలేమి సమస్యను అధిగమించడానికి

Health Tips: రాత్రివేళల్లో మీకు తొందరగా నిద్ర పట్టడం లేదా..? అయితే మీ కోసమే ఈ విలువైన సమాచారం..
Sleeplessness Upto Late Night
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 24, 2022 | 12:32 PM

నేటి కాలంలో మానవ ప్రపంచం అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంది. చాలా మంది చిన్న వయసులోనే బీపీ, షుగర్, కళ్ల సమస్యలు, మధుమేహం, కిడ్నీ సమస్యలు, నిద్రలేమి వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా నేటి యువతరం రాత్రివేళ నిద్రపట్టక తీవ్ర ఇబ్బంది పడుతోంది. అందుకు వారు అవలంభిస్తున్న జీవన విధానం, అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని చెప్పుకోవాలి. నిద్రలేమి సమస్యకు కారణాలు ఏవైనా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పు చేస్తే సరిపోతుంది. మరి నిద్రలేమి సమస్యను అధిగమించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలు, తేనె: పడుకునే ముందుగా రోజూ గోరువెచ్చని పాలల్లో ఓ స్పూన్ తేనె వేసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రెగ్యులర్‌గా పాలు తాగడం వల్ల మెల్లగా నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు. మీకు పాలు తాగడం ఇష్టం లేకపోతే తెేనెను కూడా ఉపయోగించవచ్చు. తేనెలో ఉండే ట్రిప్టోపాన్.. శరీరంలోని సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా శరీరంలో హార్మోన్లు ప్రేరేపితమయి హాయిగా నిద్రపట్టేలా చేస్తాయి.

గోరువెచ్చని పాలు, యాలకుల పొడి: పాలు తాగడం వల్ల హాయిగా నిద్రపోవచ్చు. అయితే పాలలో కొంచెం యాలకుల  పొడి కలుపుకొని తాగితే హ్యాపీగా నిద్రపడుతుంది. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల నిద్రలేమి సమస్య త్వరగా దూరం అవుతుంది.

ఇవి కూడా చదవండి

అరటిపండ్లు: అరటి పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. అరటిపండులో అధికండా మెగ్నీషియం, పొటాషియం, సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల మన జీర్ణ శక్తి మెరుగు అవుతుంది. తద్వారా హాయిగా నిద్రపడుతుంది.

బాదం: మెగ్నీషియం అధికంగా ఉండే బాదం తినడం వల్ల కూడా హాయిగా నిద్రపడుతుంది. నిద్రిస్తున్న సమయంలో రక్తంలోని చక్కెరస్థాయిని నియంత్రించడంలో కూడా బాదం ఎంతగానో సాయపడుతుంది.

చెర్రీస్: మెలటోనిన్ సమృద్ధిగా ఉండే చెర్రీలు పండ్లను తినడం వల్ల హ్యాపీగా నిద్రపోవచ్చు. వీటిని నేరుగా తీసుకోవచ్చు లేదా జ్యూస్‌లా తాగినా చక్కని ఫలితం ఉంటుంది.

చేపలు: చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. చేపలలో పుష్కలంగా ఉండే పోషకాలే ఇందుకు కారణం. వీటిని తినడం వల్ల హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

బీన్స్: బీన్స్‌లో సుఖ నిద్రకు ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని బి, బి 6, బి12 అనే విటిమన్లు నిద్రలేమి సమస్యలు దూరం చేస్తాయి.

బఠానీలు: బఠానీల్లోనూ నిద్రకు సాయపడే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.బఠానీలలోని ఫోలిక్ ఆమ్లాలు.. చక్కని నిద్ర మీ సొంతం అయ్యేలా చేస్తాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వీటిని తమ డైట్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్యాట్‌లెస్ పెరుగు: కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఫ్యాట్‌లెస్‌ పెరుగుని తీసుకోవడం వల్ల సుఖ నిద్రపడుతుంది.

ఆకుకూరలు: ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. సమస్య ఎక్కువగా ఉన్న వారు రెండు రోజులకు ఓసారి ఆకుకూరలని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ ‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?