Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: ‘కరోనా సబ్ వేరియంట్ BF7 కొత్తదేం కాదు’.. కీలక ప్రకటన చేసిన భారత ఆరోగ్య నిపుణులు..

ప్రస్తుతం ప్రపంచ ప్రజలందరూ చర్చించుకుంటున్న కరోనా బీఎఫ్‌-7 వేరియంట్‌ పాతదేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఈ వేరియంట్‌ మనుగడలో ఉన్నదని అంటున్నారు. అంతేకాక ప్రపంచ ఆరోగ్య..

Coronavirus: ‘కరోనా సబ్ వేరియంట్ BF7 కొత్తదేం కాదు’.. కీలక ప్రకటన చేసిన భారత ఆరోగ్య నిపుణులు..
Corona Virus
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 24, 2022 | 9:44 AM

ప్రస్తుతం ప్రపంచ ప్రజలందరూ చర్చించుకుంటున్న కోవిడ్ 19 బీఎఫ్‌-7 వేరియంట్‌ పాతదేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఈ వేరియంట్‌ మనుగడలో ఉన్నదని అంటున్నారు. అంతేకాక ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ ఏడాది జూలైలోనే బీఎఫ్‌-7 వేరియంట్‌ను శాస్త్రవేత్తలు అధికారికంగా గుర్తించారు. సాంకేతికంగా బీఎఫ్‌-7గా నామకరణం చేసిన బీఏ.5.2.17 వేరియంట్‌ ఇప్పటికే 50కిపైగా దేశాల్లో వ్యాపించి ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా చేసిన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో దాదాపు 50 వేల శాంపిళ్లలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ గురించి సీఎంసీ వెల్లూరుకు చెందిన వైరాలజిస్ట్‌ డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ మాట్లాడుతూ ‘మన దగ్గర బీఎఫ్‌-7 వేరియంట్‌ ఇప్పటికే మనుగడలో ఉన్నది. కానీ కేసుల సంఖ్యలో పెద్దగా మార్పు కనిపించలేదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ ‘దేశంలో 90 శాతానికిపైగా రెండు వ్యాక్సిన్‌ డోసులు తీసుకున్నారు. అందులో దాదాపు 90 శాతం మంది కొవిడ్‌ బారిన పడ్డారు. తద్వారా వారిలోని సహజ రోగనిరోధక శక్తి పెరిగింది. ఇలా మనదేశంలో హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ ఉన్నందున కొత్త వేరియంట్లు పెద్దగా ప్రభావం చూపడం లేదు’ అని పేర్కొన్నారు.

నేటి నుంచి అమల్లోకి కరోనా కొత్త మార్గదర్శకాలు

అంతర్జాతీయ ప్రయాణికుల కోసం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తి టీకా, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు సంబంధించిన రుజువులను చూపించడం తప్పనిసరి చేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్‌ వివరాలు, టీకాకు సంబంధించిన పూర్తి వివరాలతో ‘ఎయిర్‌ సువిధ’ ఫామ్‌ను నింపాలని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కొత్త మార్గదర్శకాలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.

బూస్టర్‌ డోస్‌గా కార్బోవ్యాక్స్‌

ప్రపంచ దేశాలపై కరోనా విజృంభిస్తోన్న వేళ ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వ్యాక్సిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.  బూస్టర్‌ డోస్‌గా కార్బోవ్యాక్స్‌ టీకాను తీసుకోవడం ఉత్తమమని, దీని వల్ల ఐజీజీ యాంటిబాడీస్‌ స్థాయిలు అత్యధికంగా పెరగడమే కాకుండా మెమరీ సెల్స్‌ సైతం ఎక్కువ కాలం పాటు ఉంటున్నాయని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావల్సిన పనిలేదని, బీఎఫ్‌-7 సబ్‌వేరియంట్‌ డెల్టా వేరియంట్‌ అంత ప్రమాదకారి కాదని స్పష్టం చేశారు. అయితే, కరోనా పూర్తిగా తగ్గనందున ఏటా ఒకసారి బూస్టర్‌ డోస్‌ తీసుకోవటం మంచిదని ఆయన తెలిపారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి