- Telugu News Photo Gallery Check here for the list of Non Bollywood movies that have created records in 2022
Superhit Movies 2022: ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద దమ్ము చూపించి దుమ్ము రేపిన హిందీయేతర భాషా సినిమాలు..
సాధారణంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ మాత్రమే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ 2022 సంవత్సరం ఆ అపోహలను పటాపంచలుచేసింది. ఎందుకంటే బాలీవుడ్ ఈ ఏడాది అనేక కష్టాలను ఎదుర్కొనవలసిన వచ్చింది. అయితే ఇదే సమయంలో బాలీవుడ్‌యేతర సినీ ఇండస్ట్రీల నుంచి వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఆ సినిమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 24, 2022 | 6:57 AM

RRR - ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియా భట్, శ్రీయ శరన్, సముద్రఖని ప్రధాన పాత్రలలో నటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా భారత్‌లోనే కాక జపాన్ వంటి అంతర్జాతీయ సినీ మార్కెట్లలో కూడా విజయవంతమైంది. ఆయా దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది.

కాంతారా - రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించిన కన్నడ భాషా చిత్రం కాంతారా. చిత్ర నిర్మాణ రూపకల్పన, సినిమాటోగ్రఫీ, కర్నాటక స్థానిక ‘భూత కోలా’ సంస్కృతిని సినిమాలో అద్భుతంగా చూపించడంతోదేశమంతటా కూడా కాంతారా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది.

KGF చాప్టర్ 2 - కన్నడ నటుడు యష్ నటించిన 2018 కన్నడ భాషా చిత్రం ‘KGF: చాప్టర్ 1’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా భారతచలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రానికి సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు బాగా నచ్చాయి. సినిమాలోని డైలాగులు ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోయేలా ఉన్నాయి. KGF: చాప్టర్ 1 మాదిరిగానే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.

PS 1 : మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ తమిళ భాషా చిత్రం తమిళనాడు సహా విడుదలయిన ప్రతిచోటా విజయవంతమైంది. కల్కి కృష్ణమూర్తి రచించిన కల్పిత నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం భారతదేశం అంతటా ఉన్న సినీ ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్, శరత్ కుమార్, జయం రవి, త్రిష, విక్రమ్, రెహమాన్ ప్రధాన పాత్రలలో నటించారు.

మేజర్- 26/11 ముంబై దాడుల సమయంలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో ‘బాహుబలి: ది బిగినింగ్’ ఫేమ్ అడివి శేష్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ ఏడాది తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా మేజర్ సినిమా నిలిచింది.





























