Rock Sugar Benefits: పటికబెల్లంతో ఇన్ని ప్రయోజనాలా? తెలిస్తే వావ్ అంటారు
పటికబెల్లంలో చాలా ఔషధ గుణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని సహజ చక్కెర అని కూడా అంటారు. పటిక బెల్లం తింటే కలిగే ఉపయోగాలను ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
పటికబెల్లం అంటే శుద్ధి చేయని చక్కెరకు మరో రూపం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో కలకండ అని కూడా అంటారు. మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలకు పాలు పట్టాల్సి వస్తే పటికబెల్లాన్ని పొడి చేసి పాలల్లో కలుపుతారు కానీ రెడీగా ఉందని పంచదార మాత్రం వాడరు. ఎందుకిలా చేస్తున్నారని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ పెద్దవాళ్లన ఇలానే వాడాలి. ఇది మంచిది అని చెబుతారు. నిజమే పటికబెల్లంలో చాలా ఔషధ గుణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని సహజ చక్కెర అని కూడా అంటారు. పటిక బెల్లం తింటే కలిగే ఉపయోగాలను ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
మెరుగైన జీర్ణక్రియ దగ్గర నుంచి వికారం తగ్గించడం వరకూ పటికబెల్లం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. బెల్లంలానే పటికబెల్లాన్ని కూడా చెరకుతోనే చేస్తారు. చెరకు రసాన్ని వేడి చేసి గట్టిగా అవడానికి వదిలేస్తారు. ఒక్కోసారి పటికబెల్లం తెల్లగా రావడానికి ఈ ప్రక్రియలో పాలు కూడా వాడతారు. తెలుపు లేదా ఎరుపు రంగుల్లో ఉండే పటిక బెల్లం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
- పట్టికబెల్లం సులభంగా జీర్ణమవుతుంది. దాంతో పాటు మామూలు పంచాదర కంటే తక్కువుగా తీపి ఉంటుంది.
- ఫెన్నెల్ తో పాటు పటికబెల్లం ముక్కలు మౌత్ ఫ్రెష్ నర్స్ లా వాడతారు. చాలా మంది భోజనం తర్వాత ఈ తరహా మౌత్ ఫ్రెష్ నర్స్ ను వాడతారు. మనం చాలా రెస్టారెంట్లలో దీన్ని గమనించవచ్చు.
- రాత్రి సమయంలో ఇబ్బంది పెట్టే పొడి దగ్గు నుంచి ఉపశమనం కోసం పటికబెల్లం తింటే ఔషధంలా పని చేస్తుంది. పటికబెల్లం ముక్కను బుగ్గలో పెట్టుకుని రసాన్ని మింగడం వల్ల దగ్గు సమస్య నుంచి బయటపడవచ్చు.
- మనకు వేడి చేసినప్పడు పటికబెల్లం కలిపిన నీటిని తాగడం వల్ల ఆ సమస్య నుంచి గట్టెక్కచ్చు. వేసవికాలంలో పటికబెల్లం కలిపిన నీటిని తాగాలని వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు.
- ఎసిడిటీ వల్ల కలిగే వికారం, వాంతులు వంటి అనుభూతిని దూరం చేయడానికి పటికబెల్లం సాయం చేస్తుంది. పటికబెల్లం ముక్కను నోటిలో ఉంచుకుంటే వికారం, వాంతి వస్తున్నట్లు అనిపించే ఫీలింగ్స్ తగ్గుతాయి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి