AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of Beans: బీన్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో మీకు తెలుసా..? తెలిస్తే తినకుండా ఉండలేరంతే..

చాలా మంది చికెన్, మటన్ తింటే సరిపోతుందని అనుకుంటారు. కానీ కూరగాయలు తిన్నా బలంగానే ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యం చిక్కుడు జాతి కూరగాయలు..

Benefits of Beans: బీన్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో మీకు తెలుసా..? తెలిస్తే తినకుండా ఉండలేరంతే..
Benefits Of Beans
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 24, 2022 | 2:13 PM

Share

శారీరక దృఢత్వం కోసం పోషకాలతో  నిండని ఆహారపదార్థాలను తీసుకోవడం తప్పనిసరి. అందుకోసం చాలా మంది చికెన్, మటన్ తింటే సరిపోతుందని అనుకుంటారు. కానీ కూరగాయలు తిన్నా బలంగానే ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యం చిక్కుడు జాతి కూరగాయలు శరీరానికి ఎంత మంచిదని  చెబుతున్నారు. చిక్కుడ జాతి కూరగయాల్లో మొదటగా చెప్పుకోవాల్సి బీన్స్.. ఎందుకంటే ఈ బీన్స్‌ను ‘పేదోడి మటన్’ అని కూడా అంటారు. మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు బీన్స్‌లో లభిస్తాయి. బీన్స్‌ను మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.  ముఖ్యంగా చలికాలంలో బీన్స్ తినడం చాలా మంచిదట. ఇవి మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అసలు బీన్స్ ద్వారా మనకు కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మెగ్నీషియం

బీన్స్‌లో ఉండే మెగ్నీషియం గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీన్స్ తినడం వల్ల ఎనర్జీ లెవెల్ మెరుగ్గా ఉంటాయని.. అలాగే, ఐరన్ లోపం ఏర్పడకుండా ఇవి మన శరీరాన్ని కాపాడుతాయని వారు వివరిస్తున్నారు. బీన్స్‌లో పుష్కలమైన యాంటీ-ఆక్సిడెంట్స్, విటమిన్స్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ వంటి మినరల్స్ కలిగి ఉంటుంది. కనుక ఇది మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది.

విటమిన్ బీ6

బీన్స్‌లో విటమిన్ బి6, థయామిన్, పాంతోథేనిక్ యాసిడ్, నియాసిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి సంబంధించిన వివిధ అవసరాలను తీరుస్తాయి. ఇవే కాకుండా రక్తాన్ని శుభ్రపరచడంలో ముఖ్య పాత్ర పోషించే మూలకాలు కూడా బీన్స్ లో ఉంటాయట. రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

ఫైబర్

బీన్స్‌లో ఎక్కువ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉండటం వలన క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ బీన్స్ ప్రతిరోజు తీసుకోవటం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చు. బీన్స్ నెమ్మదిగా జీర్ణమయ్యే సంక్లిష్ట కార్బోహైడ్రెట్స్ , ప్రోటీన్స్‌ను కలిగి ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో మంచిది. అంతేకాకుండా రక్తంలోని గ్లోకోజ్ స్ధాయిలను నిర్ధిష్టంగా ఉంచుతుంది.

బరువు తగ్గాలంటే

వింటర్ సీజన్‌లో బరువు తగ్గాలంటే బీన్స్‌ని డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బీన్స్‌లో ఫైబర్, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. బీన్స్ తీసుకోవడం ద్వారా శరీరం బరువు సులభంగా అదుపులో ఉంటుందట. చలికాలంలో శరీరంలో వాపు ఉంటే వాచిన ప్రదేశంలో గ్రౌండ్ ఫావా గింజలను పూయడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఫావా బీన్స్ మంటను తగ్గించడంలో సహాయపడుతుందట.

పీరియడ్స్

మహిళలు బీన్స్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పీరియడ్స్ సక్రమంగా రాలేదని ఫిర్యాదుచేసే మహిళలకు ఇవి మంచి ఔషధంగా పనిచేస్తాయట. బీన్స్ ఒక సంపూర్ణ ఆహారం. ఇది చాలా తక్కువ శాతంలో కొవ్వును కలిగి ఉంటుంది. కనుక దీనిని క్రమం తప్పకుండా తీసుకోవటం వలన మనం ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటాము.