AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘దేశంలోని తుక్డే తుక్డే గ్యాంగ్‌లను ఏకం చేసేందుకే ఈ పాదయాత్ర’.. రాహుల్ యాత్రపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక కుటుంబం గురించి మాత్రమే ఆందోళన చెందుతోందని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు..

‘దేశంలోని తుక్డే తుక్డే గ్యాంగ్‌లను ఏకం చేసేందుకే ఈ పాదయాత్ర’.. రాహుల్ యాత్రపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..
Anurag Thakur On Bharat Jodo Yatra
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 24, 2022 | 2:07 PM

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను, రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌లోని ఇతర నేతలు కరోనా సోకిన హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖును కలిసి చేతులు రాసుకునేలా తిరిగారని బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయని, అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక కుటుంబం గురించి మాత్రమే ఆందోళన చెందుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతున్నందున భారత్ జోడో యాత్రను నిలిపివేయాలన్న కేంద్ర మంత్రి ఇటీవల రాసిన లేఖకు,  కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ యాత్రను ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా బీజేపీపై విరుచుకుపడుతున్నారు.

‘ఒక కుటుంబం కోసమే కాంగ్రెస్ ఆందోళన’

రాహుల్ గాంధీ, ఆయన పాదయత్రపై ప్రశ్నలను లేవనెత్తిన అనురాగ్ ఠాకూర్.. తమ ప్రయాణంలో ద్వేషానికి బీజాలు నాటాలనుకునేవారు ప్రేమను ఎలా పంచగలరని కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. దేశం పేరు చెరిపేయడం గురించి మాట్లాడే తుక్డే తుక్డే గ్యాంగ్ భారత్ జోడో యాత్రలో నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పెరుగుతున్నా వారు తమ కుటుంబం గురించి మాత్రమే పట్టించుకుంటారని ఠాకూర్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాలని ఠాకూర్ కోరారు.

ఇవి కూడా చదవండి

‘యాత్ర చేయండి.. కానీ కోవిడ్‌ని వ్యాప్తి చేయకండి’

‘యాత్రలో అందరికీ స్వాగతం’

ఢిల్లీ చేరుకున్న భారత్ జోడో యాత్ర గురించి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నేతృత్వంలోని యాత్రలో ఎవరైనా పాల్గొనవచ్చని, అందరికీ స్వాగతమని అన్నారు. నితిన్ గడ్కరీ అయినా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అయినా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అయినా. విద్వేషానికి వ్యతిరేకంగా, భారతదేశాన్ని ఏకం చేయాలనుకునే వారెవరైనా ఈ యాత్రకు స్వాగతం పలుకుతారని అన్నారు.