AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Giant Fish: మత్స్యకారుల వలకు చిక్కిన 340 కిలోల చేప.. లాటరీ తగిలిందంటూ జాలర్లు ఫుల్‌ ఖుషీ

గంగాసాగర్‌లోని మహిష్మరి ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు గురుపాద్‌..  హుగ్లీ నదిలో చేపల వేటకు వెళ్లాడు. వల విసరగానే జాలరిని అదృష్టం వరించింది. అతని వలలో ఒక భారీ శంకర చేప చిక్కుకుంది. ఈ  చేప బరువు సుమారు 340 కిలోలు ఉన్నట్లు తెలుస్తోంది.

Giant Fish: మత్స్యకారుల వలకు చిక్కిన 340 కిలోల చేప.. లాటరీ తగిలిందంటూ జాలర్లు ఫుల్‌ ఖుషీ
Gaint Fish In West Bengal
Surya Kala
|

Updated on: Dec 24, 2022 | 2:16 PM

Share

ఉదయం ఏడు గంటలకు..  ఒక మత్స్యకారుడు వలకు భారీ చేప చిక్కింది.. సుమారు 340 కిలోల బరువున్న శంకర చేప లభించడంతో ఎనిమిది మంది మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు లాటరీ తగినంత సంతోషంగా ఉందని చెబుతున్నారు. వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సమాచారం ప్రకారం.. గంగసాగర్‌లోని మహిష్మరి ప్రాంతంలో గురువారం భారీ చేప సంచలనం సృష్టించింది. గురువారం ఉదయం గంగాసాగర్‌లోని మహిష్మరి ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు గురుపాద్‌..  హుగ్లీ నదిలో చేపల వేటకు వెళ్లాడు. వల విసరగానే జాలరిని అదృష్టం వరించింది. అతని వలలో ఒక భారీ శంకర చేప చిక్కుకుంది. ఈ  చేప బరువు సుమారు 340 కిలోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అతిపెద్ద చేపను ఒడ్డుకు తెచ్చేందుకు మత్స్యకారులు చాలానే కష్టపడ్డారు. అంత పెద్ద చేప వలలో పడటంతో జాలర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంత పెద్ద శంకర చేపను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ చేపను స్థానిక చేపల మార్కెట్‌లో 50 వేలకు విక్రయించారు. ఇంత పెద్ద మొత్తంలో శంకర చేప దొరకడంతో మత్స్యకారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంత పెద్ద సైజు శంకర చేపలు మత్స్యకారుల వలకు చిక్కడం చాలా అరుదుగా జరుగుతుందని స్థానిక మత్స్యకారులు తెలిపారు. ఈ చేపను స్థానికులు మురుళి చేప అని పిలుస్తారు. సాధారణంగా రెండు రకాల శంకర చేపలను సేకరిస్తారు. అయితే సముద్ర చేపల్లో శంకర చేపలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. మత్స్యకారుడు గురుపాద్‌ మండలం మాట్లాడుతూ.. నేను ఇంతకు ముందు శంకర చేపలను పట్టానని .. అయితే ఇంత పెద్ద సైజులో ఎప్పుడూ లేదని .. ఇప్పటి వరకు వలలకు చిక్కినవి చిన్న శంకర్ చేపలే అన్నారు. అయితే ఇంత పెద్ద చేపను పట్టుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారీ చేపను చూసేందుకు, ఫొటోలు తీయడానికి స్థానికుల్లో ఎగబడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..