AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Humanity: అమ్మతనం మహిమాన్వితం.. అనాథ శిశువుకు చనుపాలు పట్టించి ప్రాణం పోసిన పోలీసు అధికారి సతీమణి..

బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి.. కన్న ప్రేమని కాదని చిన్నారిని పొదలు పాలు చేస్తే.. పసికందు పరిస్థితిని చూసి చలించి పోయిన మరో తల్లి.. అక్కున చేర్చుని తన చనుబాలు ఇచ్చి ప్రాణాలు కాపాడింది. మంచితనం, మానవత్వం ఇంకా ఉందని మరోసారి సజీవ సాక్ష్యంగా నిలిచింది.

Humanity: అమ్మతనం మహిమాన్వితం.. అనాథ శిశువుకు చనుపాలు పట్టించి ప్రాణం పోసిన పోలీసు అధికారి సతీమణి..
Jyoti Singh Sho's Wife
Surya Kala
|

Updated on: Dec 24, 2022 | 12:39 PM

Share

కొన్ని సార్లు కొన్ని ఘటనలు చూస్తే అయ్యో అనాలో.. ఆనందం వ్యక్తం చేయాలో తెలియదు.. నవమాసాలు మోసి.. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి.. కన్న ప్రేమని కాదని చిన్నారిని పొదలు పాలు చేస్తే.. చిన్నారి పరిస్థితిని చూసి చలించి పోయిన మరో తల్లి.. అక్కున చేర్చుని తన చనుబాలు ఇచ్చి ప్రాణాలు కాపాడింది. అవును తల్లిదండ్రులు చలిలో విడిచిపెట్టిన శిశువుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ భార్య తన పాలు ఇచ్చి ప్రాణాలను కాపాడింది. మంచితనం, మానవత్వం ఇంకా ఉందని మరోసారి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని  గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

డిసెంబరు 20న నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలో పొదల్లో గుడ్డలో చుట్టి ఉన్న చిన్నారిని గుర్తించారు. చలి కారణంగా చిన్నారి పరిస్థితి చాలా విషమంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చిన్నారి బాలిక చలితో పాటు.. ఆకలితో  విలపిస్తోంది. ఆకలితో ఏడుస్తున్న శిశువుకు తల్లి పాలు తప్ప మరేమీ అవసరం ఉండదని పోలీసులకు తెలుసు. పసికందు ఆకలితో ఏడుస్తున్న విషయం  SHO భార్య జ్యోతి సింగ్ దృష్టికి చేరుకుంది. దీంతో జ్యోతి సింగ్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి చిన్నారికి పాలిచ్చి ఆకలి తీర్చారు. అనంతరం ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పసికందు పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. పసికందుని పొదల్లో విడిచి పెట్టిన తల్లిదండ్రుల గురించి ఇంకా తమకు సమాచారం లేదని పోలీసులు చెప్పారు.

ఇదే విషయంపై ANIతో మాట్లాడిన జ్యోతి సింగ్ మాట్లాడుతూ.. తమ పిల్లల్ని ఇలా రోడ్డుమీద వదిలేయవద్దంటూ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు అసలు ఎవరైనా ఇలాంటి పని ఎలా చేస్తారో తనకు అర్ధం కాదని .. పాప బాధను చూస్తుంటే తనకు  చాలా బాధగా అనిపించిందని చెప్పారు. చిన్నారి దీన స్థితి చూస్తే తనకు ఏడుపు వచ్చిందన్నారు.

ఇవి కూడా చదవండి

పసికందు అలా ఆకలితో ఏడుస్తుంటే చూస్తూ తాను ఉండలేకపోయానని.. అందుకే వెంటనే పాలివ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తమ పిల్లలను చూసుకోవడంలో ఎవరికైనా సమస్య ఉంటే.. వారిని అనాథ శరణాలయంలోనో..  లేదా ఎన్జీవో వంటి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లి ఇవ్వాలని జ్యోతి సింగ్ సూచించారు. అంతేకాని ఇలా మానవత్వం లేకుండా లోకం తెలియని చిన్నారులను రోడ్డుపక్కన, పొదల్లో వదిలేయడం చాల హేయమైన చర్య అని..  ఇలాంటి చర్యలు ఖండించదగినవి అని జ్యోతి సింగ్ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు