Love Story: ప్రేమకు హద్దుల్లేవు.. మెకానిక్ కుమార్తెతో ప్రేమ.. వేల కిలోమీటర్లు ప్రయాణం.. హిందూ సాంప్రదాయంలో పెళ్లి

ఓ విదేశీ అబ్బాయి.. భారతీయ అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి చేసుకోవడానికి ఏకంగా సముద్రాలు దాటి మరీ వచ్చాడు. హిందూ సంప్రదాయం నచ్చి మెచ్చి.. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Love Story: ప్రేమకు హద్దుల్లేవు.. మెకానిక్ కుమార్తెతో ప్రేమ.. వేల కిలోమీటర్లు ప్రయాణం.. హిందూ సాంప్రదాయంలో పెళ్లి
Mp Woman Ties Knot With Australian Man
Follow us
Surya Kala

|

Updated on: Dec 22, 2022 | 5:29 PM

ప్రేమించి మోసం చేసేవారు కొందరు అయితే.. తాము ప్రేమించిన వారి కోసం ప్రాణం అయినా సరే ఇస్తామనే వారు ఇంకొందరు. అవును నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు.. తాము ప్రేమించిన వ్యక్తి కోసం ఏమైనా చేస్తారు.. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి. తాజాగా ప్రేమ సరిహద్దులు దాటింది. గత కొంతకాలంగా భారతీయులు.. తాము ఇష్టపడిన అమ్మాయిని లేదా అబ్బాయిని పెద్దలకు చెప్పి.. ఒప్పించి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కొందరు. తాజాగా ఓ విదేశీ అబ్బాయి.. భారతీయ అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి చేసుకోవడానికి ఏకంగా సముద్రాలు దాటి మరీ వచ్చాడు. హిందూ సాంప్రదాయం నచ్చి మెచ్చి.. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఆస్ట్రేలియాకు చెందిన యాష్ హాన్స్‌చైల్డ్ అనే యువకుడు దాదాపు 10,000 కిలోమీటర్లు ప్రయాణించి మధ్యప్రదేశ్‌కు చేరుకున్నాడు.  యాష్ హాన్స్‌చైల్డ్ ధార్ జిల్లాలోని మనవార్‌కు చెందిన సైకిల్ రిపేర్ మెకానిక్ కుమార్తె తబస్సుమ్ హుస్సేన్‌ను వివాహం చేసుకున్నాడు . ఈ వివాహం డిసెంబర్ 18 మధ్యాహ్నం జరిగింది. మరి వీరిద్దరూ ఎలా కలిశారు అనేది తెలుసుకుందాం.

మీడియా కథనాల ప్రకారం వారిద్దరూ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. తబస్సుమ్ సోదరుడు రెహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మొదట వీరిద్దరూ ఈ ఏడాది ఆగస్టు 2న విదేశీ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. తబస్సుమ్‌కు ముగ్గురు అక్కచెల్లలు, ఇద్దరు అన్నదమ్ములున్నారు. ఇప్పటికే ఇద్దరు అక్కలకు వివాహమైంది. తబస్సుమ్  తండ్రి సాదిక్ హుస్సేన్ బస్టాండ్ సమీపంలోని సైకిల్ రిపేరింగ్ షాపులో పనిచేస్తారు. తల్లి గృహిణి.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియాకు చెందిన యాష్‌తో తబస్సుమ్ ఎలా ప్రేమలో పడిందంటే..  తబస్సుమ్ తన ఉన్నత చదువు కోసం ఆస్ట్రేలియా వెళ్ళింది. అక్కడ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. అక్కడ నుండి వారి ప్రేమ కథ మొదలైంది. 2016లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్య కోసం తబస్సుమ్‌కు 45 లక్షల రూపాయల గ్రాంట్‌ని అందించింది. దీంతో  తబస్సుమ్ ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ వెళ్లింది. తబస్సుమ్  చదివిన కాలేజీలో యాష్ సీనియర్‌ స్టూడెంట్. వీరిద్దరి మధ్య పరిచయం.. తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు తబస్సుమ్ బ్రిస్బేన్‌లోని ఓ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తుంది.

అయితే వీరిద్దరూ ఈ ఏడాది ఆగష్టులో కోర్టు వివాహం చేసుకున్నారు. తర్వాత తబస్సుమ్ కుటుంబాన్ని కలవడానికి యాష్ హాన్స్‌చైల్డ్ భారతదేశానికి వచ్చారు. యాష్ హాన్స్‌చైల్డ్ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం పట్ల ప్రేమలో పడ్డారు. యాష్ హాన్స్‌చైల్డ్ తల్లి  భారతదేశానికి వచ్చింది. దీంతో హిందూ సంప్రదాయం ప్రకారం మళ్ళీ ఇక్కడ తబస్సుమ్ ను యాష్ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరి ప్రేమ పెళ్లి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..