Viral Video: గూగుల్ ను ఓ ప్రశ్న అడగడానికి తాతగారి వింత పాట్లు.. గుల్‌గుల్‌ నచ్చిందంటున్న నెటిజనం..

కొందరు ప్రజలు Googleని అవసరం లేకపోయినా ఉపయోగించడం ప్రారంభించారు. కనీసం వైరల్ అవుతున్న టౌ వీడియో చూస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. వైరల్ క్లిప్‌లో.. ఒక వృద్ధుడు గూగుల్‌ని ఓ ప్రశ్న అడిగాడు.

Viral Video: గూగుల్ ను ఓ ప్రశ్న అడగడానికి తాతగారి వింత పాట్లు.. గుల్‌గుల్‌ నచ్చిందంటున్న నెటిజనం..
Old Man Funny Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 20, 2022 | 8:03 PM

స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత జీవితాన్ని సులభతరం చేస్తే… Ok Google … ఈ రెండు పదాలు ప్రజల జీవితాలను మరింత ఈజీ చేశాయి. అయితే ఈ ఒకే గూగుల్ కొందరికి తమకు తెలియని విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగించుకుంటే.. మరికొందరు దీనిని తమ ఆనందం కోసం  కూడా ఉపయోగించుకుంటున్నారు. కొందరు ప్రజలు Googleని అవసరం లేకపోయినా ఉపయోగించడం ప్రారంభించారు. కనీసం వైరల్ అవుతున్న టౌ వీడియో చూస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. వైరల్ క్లిప్‌లో.. ఒక వృద్ధుడు గూగుల్‌ని ఓ ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్న వింటే ఎవరైనా నవ్వకుండా ఉండలేరు. ఐతే మీరు కూడా ఈ వీడియో చూసి ఆనందించండి.

వైరల్ అవుతున్న వీడియోలో.. మొబైల్‌లో చాలా ఉత్సుకతతో గూగుల్ నుండి ఒక వృద్ధుడు ఏదో అడుగుతున్నట్లు మీరు చూడవచ్చు. అయితే ఆ వృద్ధుడు టంగ్ స్లిప్ అయ్యారు..  అతను గూగుల్‌కు బదులుగా గుల్ గుల్ అని చెప్పారు. అనంతరం ఆ పెద్దాయన గూగుల్ కు  క్షమాపణలు కూడా చెప్పారు. అయితే దీని తర్వాత అతను అడిగే ప్రశ్నకు బహుశా గూగుల్ దగ్గర కూడా సమాధానం లేనట్లు ఉంది. సైలెంట్ గా ఉండిపోయింది గూగుల్ కూడా.. మరి ఆ ప్రశ్న ఏంటి అంటే ఈ వీడియో చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

వృద్ధుడి వీడియోను ఇక్కడ చూడండి

View this post on Instagram

A post shared by Amit atri (@amitatri79384)

ఈ ఫన్నీ వీడియోను అమిత్ అత్రి అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వినోదం ఎంత దూరం వెళ్లిందో చూస్తూనే ఉండండి..  అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు ఈ వీడియోకి. ఇప్పటికే ఈ వీడియో 40 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకోగా, 1 లక్ష మందికి పైగా లైక్ చేశారు. చాలా మంది నెటిజన్లు తమాషాగా స్పందించారు. Googleని ఉటంకిస్తూ.. ఒకరు “నా అధికారాలు దుర్వినియోగం అవుతున్నాయి” అని చమత్కరించారు. అదే సమయంలో, మరొకరు, ‘ఇప్పుడు గూగుల్‌తో మిగిలి ఉన్న పని ఇదే’ అని చెప్పారు. నేను ‘గుల్‌గుల్‌ని గుర్తు చేసుకుంటూ మళ్లీ మళ్లీ నవ్వుతున్నాను’ అని రాశారు.  మొత్తంమీద ఈ తాతగారు గుల్ గుల్ అందరికీ నచ్చించి.. నవ్వించింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..