Viral Video: బాలీవుడ్ సాంగ్ కు నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్ సూపర్బ్ డ్యాన్స్.. మీ సృజనాత్మకత అద్భుతం అంటోన్న నెటిజన్లు

నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్ 'ది క్విక్ స్టైల్' పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది. ఒకరోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 5 లక్షల మందికి పైగా లైక్ చేశారు. నటుడు రాజ్‌కుమార్‌రావు కూడా ఈ రీల్‌ను ఇష్టపడ్డారు

Viral Video: బాలీవుడ్ సాంగ్ కు నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్ సూపర్బ్ డ్యాన్స్.. మీ సృజనాత్మకత అద్భుతం అంటోన్న నెటిజన్లు
Norwegian Dance Group
Follow us
Surya Kala

|

Updated on: Dec 20, 2022 | 7:01 PM

స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రపంచం మొత్తం మన అరచేతుల్లో దర్శనం ఇస్తుంది. దేశ, విదేశాల్లోని సంఘటనలు క్షణాల్లో కనుల ముందుకు వస్తున్నాయి. కొరియన్ పాప్ మ్యూజిక్, సీ పాప్ , నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్ ఇలా అనేక మంది కళాకారులు తమ డ్యాన్స్ తో సంగీతంతో సంగీత ప్రియులను అలరిస్తున్నారు. నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్ ది క్విక్ స్టైల్ కూడా సోషల్ మీడియాలో మంచి పాపులర్ అయింది. అవును ఈ గ్రూప్ బాలీవుడ్ చిత్రం ‘బార్ బార్ దేఖో’లోని ‘కాలా చష్మా’ పాటకు డ్యాన్స్ చేసి.. ప్రపంచం మొత్తాన్ని అలరించింది.

ఇప్పుడు ఈ డ్యాన్స్ గ్రూప్ మరోసారి బాలీవుడ్ సాంగ్ కు డ్యాన్స్ చేసి అలరిస్తోంది. నటుడు ఆయుష్మాన్ ఖురానా ఇటీవల విడుదల చేసిన ‘యాన్ యాక్షన్ హీరో’ చిత్రం నుండి ‘ జెడ నాషా ‘ సాంగ్ కు ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసి నెటిజన్లల హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో రోజు రోజుకీ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం బాలీవుడ్ సాంగ్స్ అంటే ప్రపంచం మొత్తం చెవికోసుకుంటుంది. అందుకే బాలీవుడ్ పాటలు సోషల్ మీడియాలో ఒకదాని తర్వాత ఒకటి ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం ‘జెడ నషా’ పాటకు ఉన్న క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటపై రీల్స్‌ వెల్లువెత్తాయి. ఇప్పుడు నార్వే డ్యాన్స్ గ్రూప్ ఈ పాటపై రీల్ చేసింది.. ఈ రీల్ చాలా సంచలనం సృష్టిస్తోంది. వైరల్ అవుతున్న క్లిప్‌లో, బృందంలోని ప్రతి డ్యాన్సర్ తమ డ్యాన్స్ తో చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాంగ్ కు వారు ఇచ్చిన లిప్ మూమెంట్ కూడా అద్భుతంగా ఉండడంతో ప్రతి ఒక్కరినీ ఈ వీడియో కట్టిపడేసింది.

జెడా నాషా పాటపై నార్వేజియన్ బృందం డ్యాన్స్ వీడియో 

View this post on Instagram

A post shared by Quick Style (@thequickstyle)

నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్ ‘ది క్విక్ స్టైల్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది. ఒకరోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 5 లక్షల మందికి పైగా లైక్ చేశారు. నటుడు రాజ్‌కుమార్‌రావు కూడా ఈ రీల్‌ను ఇష్టపడ్డారు. చాలా మంది కామెంట్స్ ద్వారా తమ ప్రేమని ఇష్టాన్ని తెలిజేస్తున్నారు.

ఈ డ్యాన్స్ బృందం మళ్లీ నా హృదయాన్ని గెలుచుకుంది. మరోవైపు, భారతీయ పాటలకు మీరు ఎంత అద్భుతమైన టచ్ ఇస్తారు అని మరొకరు. మీ పనితీరు నచ్చిందని ఒకరు.. మీ డ్యాన్స్ ఎంత అద్భుతమైన సృజనాత్మకత అని రకరకాల కామెంట్ చేశారు. మీరు ఎల్లప్పుడూ మా ముఖంలో చిరునవ్వును తెస్తారని తమ సంతోషాన్ని కామెంట్ రూపంలో తెలిపారు. ఓవరాల్ గా ఈ వీడియోతో నార్వే డ్యాన్స్ గ్రూప్ నెటిజన్ల మనసు గెలుచుకుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ