Viral Video: అమ్మప్రేమకు మరో ఉదాహరణ ఈ తల్లి కష్టం.. మాతృప్రేమకు పాదాభివందనం అంటోన్న నెటిజనం
ఎన్ని కష్టనష్టాలు వచ్చినా తన బిడ్డలను ఆదుకోవడంలో ముందుండేది అమ్మ. తాను ఎన్ని కష్టాలు పడినా సరే.. తన బిడ్డకు బాధ కలగరాదని కోరుకుంటుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్‌ను చూడండి..
అమ్మ అనేది ఒక పదం కాదు.. అది ఒక ప్రపంచం. అమ్మతనం లోని కమ్మదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇంటర్నెట్‌లో మనకు ఎన్ని రకాల వీడియోలు కనిపిస్తున్నప్పటికీ.. తల్లికి సంబంధించిన వీడియో మన కళ్ల ముందు కదలాడితే.. స్క్రోలింగ్ చేసే చోట వేళ్లు ఆగిపోతాయి. అనుకోకుండా మన మనసు అమ్మను గుర్తు చేసుకుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అమ్మ ప్రేమకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత.. తల్లి ప్రపంచంలోని అతిపెద్ద యోధురాలని ఎందుకు అంటారో ఎవరికైనా అర్ధం అవుతుంది.
తన బిడ్డ కోసం ఏదైనా చేయడానికైనా సిద్ధపడే వ్యక్తి ప్రపంచంలో తల్లి ఒక్కతే .. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా తన బిడ్డలను ఆదుకోవడంలో ముందుండేది అమ్మ. తాను ఎన్ని కష్టాలు పడినా సరే.. తన బిడ్డకు బాధ కలగరాదని కోరుకుంటుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్‌ను చూడండి.. దీనిలో ఒక మహిళ తన బిడ్డను వీపుపై కట్టుకుని పెళ్లి ఊరేగింపులో లైట్ పట్టుకుంది.
వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే ఊరేగింపు దృశ్యంలా అనిపిస్తోంది. ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఊరేగింపులో ప్రజలు సంబరాలు చేసుకుంటుండగా.. మరోవైపు చాలా మంది మహిళలు డబ్బుల కోసం ఊరేగింపులో భాగంగా చేతిలో లైట్స్ పట్టుకుని రోడ్డుకు ఇరువైపులా నడుకుంటూ వెళ్తున్నారు. ఇలా నడుస్తున్న మహిళల్లో ఒక మహిళ అక్కడ ఉన్నవారిని ఆకర్షించినట్లు ఉంది. అందుకు వెంటనే ఊరేగింపుని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎందుకంటే లైట్స్ పట్టుకుని నడుస్తున్న మహిళల్లో ఒక స్త్రీ ఓ చేతిలో లైట్ పట్టుకోవడమే కాదు… తన వీపుకి బట్టని కట్టుకుని అందులో తన బిడ్డను పెట్టుకుని సంతోషముగా నడుస్తుంది. ఆమె తన బిడ్డను పెంచుకోవడానికి ఈ పని చేస్తోందని తెలుస్తోంది. మహిళ నిస్సహాయతను చూసి జనం భావోద్వేగానికి గురవుతున్నారు.
मजबूरी का नाम ज़िन्दगी है! no words!
आज जब सामने से बारात गुज़री तो यह नज़ारा देख कर दिल बैठ आया!#माँ की जगह कोई नही ले सकता!#motherhood
https://t.co/XcOpBPwdy2 pic.twitter.com/9szHoKzUSY
— Sadaf Afreen صدف (@s_afreen7) December 14, 2022
ఈ వీడియోను సదాఫ్ ఆఫ్రీన్ అనే ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటి వరకూ 92 వేల మందికి పైగా వీక్షించారు. ఈ ప్రపంచంలో తల్లి కంటే ఎవరూ గొప్పవారు కాదు. అమ్మ ప్రేమకు హృదయపూర్వక వందనాలు. అదే సమయంలో, ‘పేదరికం నిజంగా చాలా బాధాకరం అంటూ రకరకాల కామెంట్స్ చేశారు. దీంతో పాటు పలువురు అమ్మ మనసుకి పాదాభివందనం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..