AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్కూల్ ఎగొట్టి పత్తాలాడుతున్న కొడుకు.. షూతో వాయగొట్టిన తండ్రి.. సూపర్ అంటున్న నెటిజన్స్

మనదేశంలో ఇప్పటికీ పల్లెటూళ్లలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. స్కూల్ కి వెళ్లి చదువుకోవాల్సిన సమయంలో తమ పిల్లలు స్నేహితులతో ఆడుకుంటూ కనిపిస్తే ఆ తండ్రికి కోపం వచ్చే సందర్భం గురించి ఎంత చెప్పినా తక్కువే..

Viral Video: స్కూల్ ఎగొట్టి పత్తాలాడుతున్న కొడుకు.. షూతో వాయగొట్టిన తండ్రి.. సూపర్ అంటున్న నెటిజన్స్
Father Beating Son Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 18, 2022 | 4:54 PM

ఏ పిల్లల జీవితంలోనైనా విద్య చాలా ముఖ్యమైనది. స్కూల్ లో విద్యార్థి దశ నుంచి పిల్లాడి భవిష్యత్తుకు పునాది పడుతుంది. అయితే, చిన్నతనంలో పిల్లలకు ఆటలపై ఉన్నంత ఇష్టం.. చదువు పై ఉండదు. ఇది సర్వసాధారణంగా ప్రతి చిన్నారి విషయంలో జరుగుతుండేది. ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు పిల్లలు ఆడుకోవడానికి తమ తల్లిదండ్రులకు తెలియకుండా బయటివెళ్లారు. తర్వాత ఈ విషయం తమ కుటుంబసభ్యులకు తెలిస్ట్.. వెంటనే నాలుక కరుచుకున్నారు. బహుశా ఇలాంటి సంఘటనలు  చిన్నతనంలో కూడా జరిగి ఉండవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ వీడియో చుసిన ఎక్కువమంటి నెటిజన్లు.. తమ బాల్యం గుర్తుకు తెస్తుంది అంటూ చాలా ఆనందిస్తున్నారు.

వాస్తవంగా ఈ వీడియోలో ఒక తండ్రి తన బిడ్డను షూతో దారుణంగా కొట్టడం కనిపిస్తుంది. అయితే ఇలా పిల్లలను తల్లిదండ్రులు కొట్టడం తప్పని కొందరు అంటారు.. కానీ మనదేశంలో ఇప్పటికీ పల్లెటూళ్లలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. స్కూల్ కి వెళ్లి చదువుకోవాల్సిన సమయంలో తమ పిల్లలు స్నేహితులతో ఆడుకుంటూ కనిపిస్తే ఆ తండ్రికి కోపం వచ్చే సందర్భం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇలాంటి సంఘటన వైరల్ అవుతున్న వీడియాలో తండ్రి, కొడుకుల మధ్య చోటు చేసుకుంది. కొడుకుని తండ్రి అక్కడే ఉతికి ఆరేస్తున్నాడు. ఈ వీడియో కూడా ఏదో గ్రామీణ ప్రాంతానికి చెందినదేనని తెలుస్తోంది. శిథిలమైన ఇంట్లో కొంతమంది అబ్బాయిలు ఒక రాయిపై హాయిగా కూర్చుని కార్డులు ఆడుతున్నారని వీడియోలో మీరు చూడవచ్చు. ఇంతలో..  ఒక అబ్బాయి తండ్రి అక్కడకు చేరుకుని..  తన కొడుకు ఆడుకోవడం చూశాడు. వెంటనే తండ్రి తన బూట్లని చేతుల్లోకి తీసుకుని కొడుకుని కొట్టడం ప్రారంభించాడు. బాలుడి వీపుపై, తలపై షూతో దారుణంగా కొట్టాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @HasnaZarooriHai అనే IDలో షేర్ చేశారు.  అంతేకాదు… కొడుకుపై తండ్రి ప్రేమ ఇప్పుడు ఇలా ముగిసింది’ అని క్యాప్షన్ ఇచ్చారు. 22 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 15 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేశారు.

అదే సమయంలో.. ఈ వీడియోను చూసిన ప్రజలు భిన్నమైన కామెంట్ చేస్తున్నారు. ఒకరు ఈ శిక్ష ‘చాలా బాగుంది. మీరు కష్టపడి చదవకపోతే.. మీ భవిష్యత్ నాశనం అవుతుంది కామెంట్ చేస్తే.. మరొకరు ‘ఈ ప్రేమ పిల్లలకు.. ముఖ్యంగా కొడుకులకు సరైన మార్గాన్ని చూపుతుంది.. కొనసాగుతుంది. ఈ ప్రేమ ఎప్పటికీ తగ్గదని అన్నారు. అదే విధంగా మరో యూజర్ ‘అతని స్నేహితులు కొట్టించి మరీ ఎంజాయ్ చేస్తున్నారు’ అని ఫన్నీగా కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..