India’s Beaty Places: మీరు ప్రకృతి ప్రేమికులా? ఒడిశాలోని ఈ అద్భుతమైన ప్రదేశాలను ఓసారి చుట్టేయండి..

భారతదేశం ప్రకతి సౌందర్యాలకు నెలవు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో అద్భుతాలు, సుందర దృశ్యాలు, నిగూఢ రహస్యాలు ఉన్నాయి. అలాంటి రాష్ట్రాల్లో వాసరత్వ సంపద పరంగా,

India's Beaty Places: మీరు ప్రకృతి ప్రేమికులా? ఒడిశాలోని ఈ అద్భుతమైన ప్రదేశాలను ఓసారి చుట్టేయండి..
Odisha Tourism
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 18, 2022 | 4:03 PM

భారతదేశం ప్రకతి సౌందర్యాలకు నెలవు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో అద్భుతాలు, సుందర దృశ్యాలు, నిగూఢ రహస్యాలు ఉన్నాయి. అలాంటి రాష్ట్రాల్లో వాసరత్వ సంపద పరంగా, సాంస్కృతికంగా ముందుండే రాష్ట్రం ఒడిశా. ఈ రాష్ట్రంలో బీచ్‌లు, దేవాలయాలు, బయోస్పియర్ రిజర్వ్‌లు, మ్యూజియం‌లు, టూరిస్ట్ హాట్‌స్పాట్‌లతో సహా అనేక సందర్శనా స్థలాలు ఉన్నాయి. ఈ తీర ప్రాంతంలోని ప్రధాన పర్యాటక ప్రదేశం పూరీలోని జగన్నాథ దేవాలయం. కోటలు, దేవాలయాలు వంటి అద్భుతమైన నిర్మాణాలు ఒడిశాలో ఉన్నాయి. బీచ్‌లు, నిర్మలమైన సరస్సులు సహజ సౌందర్యాలకు నెలవు. అందుకే ఒడిశా ప్రయాణం గొప్ప అనుభూతిని ఇస్తుందని అంటారు పర్యాటకులు. అయితే, ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కొన్ని అద్భుతమైన ప్రదేశాలు వెలుగులోకి రాలేదు. వాటిని ప్రజలు ఎక్కువగా సందర్శించలేదు. అలాంటి ప్రదేశాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..

పూరి..

విశ్రాంతి కోసం వెళ్లాలనుకుంటే.. అందుకు అనువైన ప్రదేశం పూరి. మిరుమిట్లు గొలిపే బీచ్‌లతో పాటు, పూరి జగన్నాథుడి ఆలయం కూడా అక్కడ మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. బీచ్‌లు, దేవాలయాలు, సుందర దృశ్యాలు పూరీ యాత్రలో చూసేందుకు వీలుంటుంది.

సిమ్లిపాల్ నేషనల్ పార్క్..

సాహస ప్రియులకు సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఒక కలల ప్రదేశం. ఇది భారతదేశంలోని 7వ అతిపెద్ద జాతీయ ఉద్యానవనం. 2009 నుండి UNESCO వరల్డ్ నెట్‌వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్‌లో భాగంగా ఉంది. ఈ అడవిలో 40 రకాల క్షీరదాలు, 30 జాతుల సరీసృపాలు, దాదాపు 240 జాతుల పక్షులు ఉన్నాయి. ఇది ఆసియా ఏనుగులు, బెంగాల్ టైగర్స్, చౌసింగ్ మరియు గౌర్‌లకు నిలయం.

ఇవి కూడా చదవండి

రఘురాజ్‌పూర్ ఆర్ట్ విలేజ్..

రఘురాజ్‌పూర్ ఆర్ట్ విలేజ్ ఒక అందమైన ఆర్ట్ & క్రాఫ్ట్ హెరిటేజ్ గ్రామం. పట్టచిత్ర వంటి స్థానిక హస్తకళలు, పౌరాణిక ఇతివృత్తాలు, తాటి ఆకులతో తయారు చేసే చిత్రాలకు ప్రసిద్ధి. ఇక్కడ హోమ్ డెకర్ కోసం అద్భుతమైన కళాకృతులు ఉంటాయి.

కొరాపుట్ జిల్లా..

కొరాపుట్ జిల్లా ఒడిశాలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది సహజంగానే అద్భుతమైన వాతావరణం, అందమైన సంస్కృతి, సంప్రదాయం, సుందరమైన దృశ్యాలకు నెలవు. ఈ ప్రదేశం శక్తివంతమైన డియోమాలి శ్రేణికి నిలయం. ఇది రాష్ట్రంలోనే ఎత్తైన పర్వత శ్రేణి. దట్టమైన అడవితో ఉండి. సాహస ప్రియులకు గమ్యస్థానంలా ఉంటుంది.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..