AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aliens: భూమిపైకి గ్రహాంతవాసులొచ్చారా? షాకింగ్ వివరాలు వెల్లడించిన అమెరికా శాస్త్రవేత్తలు..

భూమిపై గ్రహాంతరవాసులు ఉన్నారా..? ఉన్నారు అనడానికి ఆధారాలున్నాయా..? అంతు చిక్కని రహస్యంపై అమెరికా సైనికాధికారులు ఏం చెబుతున్నారు..? గ్రహాంతరవాసులు, వారి వ్యోమనౌకలుగా భావిస్తున్న ఫ్లయింగ్‌

Aliens: భూమిపైకి గ్రహాంతవాసులొచ్చారా? షాకింగ్ వివరాలు వెల్లడించిన అమెరికా శాస్త్రవేత్తలు..
Ufo
Shiva Prajapati
|

Updated on: Dec 17, 2022 | 9:29 PM

Share

భూమిపై గ్రహాంతరవాసులు ఉన్నారా..? ఉన్నారు అనడానికి ఆధారాలున్నాయా..? అంతు చిక్కని రహస్యంపై అమెరికా సైనికాధికారులు ఏం చెబుతున్నారు..? గ్రహాంతరవాసులు, వారి వ్యోమనౌకలుగా భావిస్తున్న ఫ్లయింగ్‌ సాసర్లు ఉన్నాయా? లేదా? ఎన్నో ఏళ్లుగా ఇదొక అంతుచిక్కని రహస్యమే. అయితే ఏలియన్లు భూమిని సందర్శించినట్లు గానీ, లేదా ఇక్కడ దిగినట్లు చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదని అమెరికా సీనియర్ సైనిక అధికారులు తాజాగా వెల్లడించారు. యూఎఫ్‌వో సంబంధిత ఘటనలపై రూపొందిన వందలాది రిపోర్ట్‌లను లోతుగా పరిశీలించినట్లు యూఎస్‌ డిఫెన్స్‌ అండర్‌ సెక్రటరీ ఒకరు తెలిపారు.

మరోవైపు గ్రహాంతరవాసుల ఉనికిని మాత్రం కొట్టిపారేయలేమని.. పెంటగాన్ కొత్తగా ఏర్పాటు చేసిన ఆరో డైరెక్టర్‌ కిర్క్‌ ప్యాట్రిక్‌ అన్నారు. దీనిపై శాస్త్రీయ విధానాల్లో పరిశోధనలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అమెరికా సైనిక స్థావరాలు, నిషేధిత గగనతలం, ఇతరత్రా ప్రదేశాల్లో అసాధారణ, గుర్తుతెలియని వస్తువుల కార్యకలాపాలపై ఆరో దృష్టి సారిస్తుంది.

గుర్తించని వైమానిక దృగ్విషయాలు అంటూ అమెరికా సైన్యం పేర్కొనే 140కిపైగా యూఎఫ్‌వో సంబంధిత ఘటనలను ప్రభుత్వం గతేడాది ఓ నివేదికలో పొందుపర్చింది. ఆ తర్వాత కూడా వందల కేసులూ నమోదైనట్లు కిర్క్‌ప్యాట్రిక్ చెప్పారు. ఇటీవల ఆమోదించిన వార్షిక రక్షణ విధాన బిల్లులోనూ అమెరికా కాంగ్రెస్.. పెంటగాన్‌ ప్రయత్నాలపై దృష్టి సారించింది. 1945ల నాటినుంచి యూఎఫ్‌వోలకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులను పరిశీలించి ఒక నివేదికను సిద్ధం చేయాలని సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అమెరికా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..