AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IQ Test: హాలో బాస్.. దమ్ముంటే చెయ్ టాస్క్.. కనిపెడితే మీ ఐక్యూ పీక్స్.. 15 సెకన్లే టైమ్..

ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్ ఎప్పుడూ మన మెదళ్లకు పెద్ద పనినే పెడతాయి. చూసేందుకు ఒకనిపించినా.. అందులోని కనిపించని రహస్యం దాగుంటుంది. అది కనిపెట్టాలంటే నిజంగా బుర్రకు పెద్ద పని పెట్టాలి.

IQ Test: హాలో బాస్.. దమ్ముంటే చెయ్ టాస్క్.. కనిపెడితే మీ ఐక్యూ పీక్స్.. 15 సెకన్లే టైమ్..
Optical Illusion Thumb
Shiva Prajapati
|

Updated on: Dec 17, 2022 | 5:47 PM

Share

ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్ ఎప్పుడూ మన మెదళ్లకు పెద్ద పనినే పెడతాయి. చూసేందుకు ఒకనిపించినా.. అందులోని కనిపించని రహస్యం దాగుంటుంది. అది కనిపెట్టాలంటే నిజంగా బుర్రకు పెద్ద పని పెట్టాలి. లేదంటే అంత ఈజీగా దొరకదు మరి. ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్ సహజంగానే చూడటానికి చాలా అందంగా, ఆసక్తికరంగా ఉంటాయి. చూడటానికి ఎంత బాగుంటాయో.. అందులోని నిగూఢ రహస్యాన్ని కనిపెట్టడానికి అంతే ఉత్సకతను రేకెత్తిస్తాయి. ఆ రహ్యాన్ని కనిపెడితే వచ్చే మజానే వేరు ఉంటుంది. ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. అదే సమయంలో వాస్తవికంగా చూసుకుంటే మాత్రం.. మెదడు పనితీరు మెరుగపడుతుంది. ఐక్యూ పెరుగుతుంది. కంటిచూపు సామర్థ్యం కూడా పెరుగుతుంది. తాజాగా అలాంటి అద్భుతమైన, అందమైన, ఓ రహస్యాన్ని తనలో దాచుకున్న ఆప్టికల్ ఇల్యూజన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వాస్తవానికి ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్.. కొన్ని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తే.. మరికొన్ని ఐక్యూ లెవల్స్ ఎంతో తేలుస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫోటో కూడా అలాంటిదే. ఇది మీ కంటి చూపుకు అగ్నిపరీక్ష లాంటిదని చెప్పుకోవాలి. ఈ పిక్‌లో ముగ్గురు అందమైన అమ్మాయిలు కలిసి వెళ్తున్నారు. ఈ ముగ్గురు అమ్మాయిలను వారి ప్రియులు కూడా అనుసరిస్తున్నారు. కాకపోతే వారు చాలా రహస్యంగా ఉన్నారు. ఆ ముగ్గురు ఎక్కడ ఉన్నారో కనిపెట్టడమే మీ టాస్కర్. ఫోటోలోని ముగ్గురు అమ్మాయిల వెనుకే.. ఈ ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఈ పిక్చర్‌ను కాస్త క్లోజ్‌గా గమనిస్తే.. ఆ బాయ్ ఫ్రెండ్స్ ముఖాలు స్పష్టంగా కనిపిస్తాయి. మరెందుకు ఆలస్యం.. టాస్క్ మొదలెట్టండి. అయితే, ఇక్కడో కండీషన్. కేవలం 20 సెకన్లలో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే.. మీ ఐక్యూ లెవల్స్ పీక్స్ అని చెప్పుకోవచ్చు. కొంచెం లేటుగా కనిపెడితే కాస్త బెటర్.. కనిపెట్టలేకపోతే చాలా పూర్ అనుకోవాల్సిందే.

కనిపెట్టారా? లేదా? ఇక్కడ క్లూస్ చూడండి..

1. ఫోటోను పైకి స్క్రోల్ చేయండి. చెట్లను జాగ్రత్తగా చూడండి. చెట్ల మధ్యలో గమనిస్తే కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇదిగో సమాధానం..

ఫోటోకి ఎడమ వైపున ఉన్న చెట్టులో ఒక యువకుడి ముఖం దాగి ఉంది. మరో ఇద్దరు ప్రేమికులు.. ఫోటో కుడి వైపున ఉన్న విండ్‌మిల్ క్రింద ఉన్న చెట్లలో దాగి ఉన్నారు.

Optical Illusion

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..