AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆ యువకుడికి రోజూ రాత్రుళ్లు అదే పని.. ఇలా వారం రోజులు గడిచింది.. సీన్ కట్ చేస్తే!

మనిషన్న వాడు ప్రతీ ఒక్కరికీ ఏదొక అలవాటు ఉంటుంది. కొంతమందికి పుట్టుకతోనే అవి అవలంభిస్తే..

Viral: ఆ యువకుడికి రోజూ రాత్రుళ్లు అదే పని.. ఇలా వారం రోజులు గడిచింది.. సీన్ కట్ చేస్తే!
Viral
Ravi Kiran
|

Updated on: Dec 17, 2022 | 12:39 PM

Share

మనిషన్న వాడు ప్రతీ ఒక్కరికీ ఏదొక అలవాటు ఉంటుంది. కొంతమందికి పుట్టుకతోనే అవి అవలంభిస్తే.. మరికొంతమందికి మధ్యలో వస్తాయి. ఇలా ఓ యువకుడికి మధ్యలో వచ్చిన ఒక అలవాటు ఏకంగా ప్రాణం మీదకు తెచ్చింది. పగలంతా ఆఫీస్ పనులతో బిజీబిజీగా గడుపుతోన్న ఓ యువకుడు.. రాత్రుళ్లు నిద్రపోకుండా అదే పని చేశాడు. ఇలా వారం రోజులు తన దినచర్య కొనసాగిన అనంతరం.. అతడికి ఊహించని పరిణామం ఎదురైంది. ఇంతకీ అసలేం జరిగింది.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

చైనాకు చెందిన 26 ఏళ్ల యువకుడైన కావో వుహన్ నగరంలో నివాసముంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజులు బాగానే ఉంది. అయితే ఆ తర్వాతే మనోడి బిహేవియర్‌లో మార్పు వచ్చింది. ఉదయాన్నే డ్యూటీ వెళ్లి.. సాయంత్రం 6 గంటలకు తిరిగి ఇంటికొచ్చే కావో.. క్రమేపీ రాత్రి వేళల్లో నిద్రపోవడం మానేశాడు. నైట్ టైం అంతా కూడా ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూస్తూ తన సమయాన్ని గడిపేశాడు. ఇలా వారం రోజులు గడిచాయి. అంతే! అతడి ముఖంలో మార్పులు రావడం మొదలయ్యాయి. పెదాలు ఒకవైపు తిరిగిపోవడం, కంటి రెప్పలు వాల్చేందుకు కూడా కష్టంగా మారడంతో వెంటనే డాక్టర్‌ను సంప్రదించాడు. కావో ముఖానికి పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్లు అతడి ముఖానికి పక్షవాతం వచ్చినట్లు వెల్లడించారు. రాత్రుళ్లు నిద్రపోకుండా ఉండేవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు అతడికి చెప్పారట. కాగా, ప్రస్తుతం కావోకి డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. కొద్దిరోజుల్లో అతడి పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు.

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!