AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guinness world record: 86 ఏళ్ల వయసులోనూ అదే స్టామీనా.. వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన గ్రేట్‌ లేడీ

సీటుపై స్టిక్కర్లు, చాక్‌పీస్‌తో రాసే బోర్డులు ఉండేవి. విమానయాన పరిశ్రమలో వచ్చిన మార్పుల గురించి ఆమె మాట్లాడుతూ, ఇప్పుడు విమాన సిబ్బందికి మునుపటి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.

Guinness world record: 86 ఏళ్ల వయసులోనూ అదే స్టామీనా.. వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన గ్రేట్‌ లేడీ
Flight Attendant
Jyothi Gadda
|

Updated on: Dec 17, 2022 | 5:56 PM

Share

వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు ఈ మహిళ..ఆమె అమెరికాకు చెందిన బెట్టె నాష్‌..ఈవిడ1950లలో యుక్తవయసులో ఉన్నప్పుడు మొదటిసారిగా వర్జీనియాలోని రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరింది. విమానంలోని సిబ్బంది దుస్తులు, ప్రవర్తనకు ఆమె ఎంతగానో ఆకర్షితులరాలైంది. దాంతో ఆమె కూడా ఫ్లైట్ అటెండెంట్‌గా మారాలని నిర్ణయించుకుంది. కొంతకాలం తర్వాత 1957లో ఆమె ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌తో విమానయానంలో తన వృత్తిని ప్రారంభించింది. ఈరోజు బెట్టె నాష్‌కి 86 సంవత్సరాలు. కానీ, ఆమె కెరీర్ తొలినాళ్లలో ఎలా ఉందో అదే స్ఫూర్తి. ఆమె ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసి 65 ఏళ్లు దాటింది. నాష్ ఇప్పటికీ విమానయాన పరిశ్రమలో పనిచేస్తుండటం గమనార్హం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఆమె ప్రపంచంలోనే ఎక్కువ కాలం పనిచేసిన విమాన సహాయకురాలు.

నాష్ తన కెరీర్ ప్రారంభించినప్పటి నుండి చాలా మార్పులు వచ్చాయి. ఆమె US అధ్యక్షుడు డి ఐసెన్‌హోవర్ నుండి జో బిడెన్ వరకు తన పదవీ కాలంలో చూసింది.. ఈరోజుతో పోల్చితే విమానాలకు ముందస్తు రిజర్వేషన్ అవసరం లేనప్పుడు, టిక్కెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నప్పటి నుండి ఆమె పని చేస్తోంది. ఆ రోజుల్లో విమానం ఎక్కే ముందు ప్రయాణీకులు వెండింగ్ మెషీన్ల నుండి జీవిత బీమాను కూడా కొనుగోలు చేసేవారు. టెక్నాలజీ రోజువారీ పనులను సులభతరం చేసిందని బెట్టె నాష్ అన్నారు. చేతితో రాసిచ్చే టిక్కెట్లు ఉండే రోజులు పోయాయి. సీటుపై స్టిక్కర్లు, చాక్‌పీస్‌తో రాసే బోర్డులు ఉండేవి. విమానయాన పరిశ్రమలో వచ్చిన మార్పుల గురించి ఆమె మాట్లాడుతూ, ఇప్పుడు విమాన సిబ్బందికి మునుపటి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.

86 ఏళ్ల బెట్టె నాష్ తన మొత్తం కెరీర్‌లో న్యూయార్క్ నుండి వాషింగ్టన్ DCకి, అక్కడి నుండి బోస్టన్‌కు వెళ్లే మార్గంలో మాత్రమే పనిచేశానని చెప్పారు. కుటుంబ సమేతంగా ఉండేందుకు ఈ రూట్లో పనిచేశామన్నారు. ఆమెకు వికలాంగుడైన కుమారుడు ఉన్నాడు. అతని సంరక్షణ కోసం ఆమె ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. గత 65 ఏళ్లుగా ఆమె విమానంలో తిరుగుతూ ఇక్కడి గగన వీధుల్ని పరిపాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి