Portable Heater: చలికాలంలో వెచ్చదనం కోసం పోర్టబుల్ హీటర్.. ఎంచక్కా దీన్ని మీ జేబులో పెట్టుకు పోవచ్చు..
మీరు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే హీటర్లను ఉపయోగించుకుంటారు. కానీ, ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న ఈ బుల్లి హీటర్ మాత్రం మీ జేబులో పెట్టుకుని వెళ్లేంతే ఈజీగా ఉంటుంది. అవును ఈ పాకెట్ హీటర్ జేబులో పెట్టుకునేంత చిన్నగా ఉంటుంది.
శీతాకాలం వణికిస్తోంది. ఎముకలు కొరికే చలి చంపేస్తోంది. చలి నుంచి ఉపశమనం కోసం చాలా మంది హీటర్లను వాడుతుంటారు. బయట చల్లగా ఉంటే హాటర్ల సాయంతో రూమ్ టెంపరెచర్ పెంచుకుని వెచ్చగా ఉండోచ్చు. కానీ, మీరు బయటకు వెళ్లినప్పుడు చల్లగా ఉంటే అటువంటి పరిస్థితిలో మీరు ఈ హీటర్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. మార్కెట్లో అనేక రకాల హీటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు నచ్చనివి, మీ బడ్జెట్ ప్రకారం ఎంచుకోవచ్చు. కానీ ఈ హీటర్లన్నింటికీ ఓ పెద్ద సమస్య ఉంది. మీరు వాటిని ఇంటి నుండి బయటకు తీసుకెళ్లి వాటిని ఉపయోగించలేరు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించుకుంటారు. కానీ, ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న ఈ బుల్లి హీటర్ మాత్రం మీ జేబులో పెట్టుకుని వెళ్లేంతే ఈజీగా ఉంటుంది. అవును ఈ పాకెట్ హీటర్ జేబులో పెట్టుకునేంత చిన్నగా ఉంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఈ హీటర్ పేరు ప్లేస్‌హాబ్ బ్రాండెడ్ 1pcs గోల్డెన్ పాకెట్ హీటర్, మల్టీ పోర్టబుల్ ఎలక్ట్రిక్ హీటర్ యాస్ హ్యాండ్ వార్మర్ పాకెట్ హీటర్ 5200mah పవర్ ఇది అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కస్టమర్లు సులభంగా కొనుగోలు చేయవచ్చు. మీరు కూడా ఈ హీటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, ప్రస్తుతం ఇది స్టాక్‌లో లేదని తెలిసింది. కానీ, ఫ్యూచర్‌లో కొనుగోలు చేయాలని భావించే వారి కోసం ఇక్కడ దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఈ పాకెట్ హీటర్‌లో 5200 mAh శక్తివంతమైన బ్యాటరీ ఉంటుంది. హ్యాండ్ ఇంటర్‌ఫేస్‌ను అమలు చేయడానికి బ్యాటరీ ఉపయోగించబడుతుంది. ఈ పరికరంతో పాటు ఛార్జింగ్ కేబుల్ కూడా వస్తుంది. జేబులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దీన్ని ఉపయోగించడానికి మీరు దాని పవర్ బటన్‌ను ఆన్ చేయాలి. చలికాలంలో ఈ హీటర్ చక్కటి సాధనంగా పనిచేస్తుంది. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లడం దీని ప్రత్యేకత.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..