AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Payments: అయ్యో! క్రెడిట్ కార్డు డ్యూ డేట్ మిస్ అయ్యారా? పెనాల్టీ పడుతుందిగా! మరేం చేయాలి? ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు!

డ్యూడేట్ మిస్ అయినా.. నగదు అందుబాటులో లేక చెల్లించాల్సిన సొమ్ము కట్టకపోయినా క్రెడిట్ కార్డు సంస్థలు వేసే పెనాల్టీ అయినా.. లేట్ పేమెంట్ చార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా దాని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ పై పడుతుంది. మరి అటువంటి సమయంలో ఏం చేయాలి?

Credit Card Payments: అయ్యో! క్రెడిట్ కార్డు డ్యూ డేట్ మిస్ అయ్యారా? పెనాల్టీ పడుతుందిగా! మరేం చేయాలి? ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు!
Credit Card
TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 17, 2022 | 3:55 PM

Share

క్రెడిట్ కార్డ్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలు గట్టెక్కించడంలో ఈ కార్డు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎటువంటి వడ్డీ లేకుండా నిర్ణీత కాల వ్యవధిలోపు చెల్లింపులు చేసుకుంటూ ఉంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోతేనే అసలు సమస్య వస్తుంది. డ్యూడేట్ మిస్ అయినా.. నగదు అందుబాటులో లేక చెల్లించాల్సిన సొమ్ము కట్టకపోయినా క్రెడిట్ కార్డు సంస్థలు వేసే పెనాల్టీ అయినా.. లేట్ పేమెంట్ చార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా దాని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ పై పడుతుంది. మరి అటువంటి సమయంలో ఏం చేయాలి? లేట్ పేమెంట్స్ చార్జీలు పడకుండా ఉండాలంటే ఏ విధంగా కార్డును మెయింటేన్ చేయాలి? అసలు లేట్ పేమెంట్స్ ప్రభావం మీ ఖాతాలపై ఎంత వరకూ ఉంటుందో ఓ సారి చూద్దాం..

మూడు రోజుల గ్రేస్ పిరియడ్..

క్రెడిట్ కార్డు డ్యూ డేట్ మిస్ అయినా .. మరో మూడు రోజుల పాటు కంపెనీలు గ్రేస్ పిరియడ్ ఇస్తాయి. అంటే డ్యూ డేట్ అయిపోయిన తర్వాత కూడా మూడు రోజుల వరకూ ఎటువంటి వడ్డీలు, పెనాల్టీలు లేకుండా చెల్లింపులు చేసుకోవచ్చు. అప్పటికీ చెల్లించకపోతే అప్పుడు లేట్ ఫీజ్ సైకిల్ ప్రారంభమవుతుంది. ప్రతి బ్యాంకు కార్డుపై ఉన్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ పై ఫీజులు వసూలు చేస్తాయి. అంటే గత నెలలో మీరు ఖర్చు చేసిన మొత్తంపై అన్నమాట. మీరు కట్టవలసిన డ్యూ డేట్ నుంచి మళ్లీ కొత్త స్టేట్మెంట్ వచ్చే వరకు రోజూ వారీ ఫీజులు పడతాయి. ఈ ఫీజులు ఒక్కో బ్యాంకుకు ఒక్కో రకంగా ఉంటాయి.

సమయానికి కట్టేయడం ఉత్తమం..

క్రెడిట్ కార్డు బిల్లులు అవకాశం ఉన్నంత వరకూ డ్యూడేట్ లోపు కట్టేయడం అత్యుత్తమం. ఒకవేళ కట్టలేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా మీ క్రెడిట్ స్కోర్ బాగా దెబ్బతింటుంది. ఆ నెగిటివ్ ప్రభావం చాలా కాలం కొనసాగితే డిఫాల్ట్ కింద మార్క్ చేస్తారు. దీని వల్ల భవిష్యత్తులో ఎటువంటి రుణాలు మీకు మంజూరు కావు.

ఇవి కూడా చదవండి

లేట్ పేమెంట్స్ లేకుండా ఉండాలంటే..

– ఆటోమేటిక్ పేమెంట్స్.. కార్డ్ చెల్లింపులకు కంపెనీలు కొన్ని సులభతరమైన విధానాలను సూచిస్తాయి. అందులో మొదటిది ఆటో పేమెంట్ ఆప్షన్. ఇదే ఎనేబుల్ చేసుకుంటే డ్యూ డేట్ ఎప్పుడు అనే ఆలోచన మనకు లేకున్నా.. ఆటోమేటిక్ ఆ డేట్ లో మన అకౌంట్ నుంచి బిల్ అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. దీంతో డ్యూ డేట్ మిస్ అయ్యే చాన్సే లేదు.

పేమెంట్ రిమైండర్స్.. ఒకవేళ మీకు ఆటోపే ఆప్షన్ కష్టమైతే వీలనన్నీ రిమైండర్స్ ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా డ్యూ డేట్ వచ్చే రెండు మూడు రోజుల ముందు నుంచి అలర్ట్ మేసేజ్ వస్తుంటాయి కాబట్టి డేట్ మిస్ కాము.

– డ్యూ డేట్ చేంజ్ చేసుకోండి.. మీకు ఒకటి రెండు కార్డ్స్ ఉన్నాయనుకోండి.. అన్ని డ్యూ డేట్లు ఒకేసారి వస్తే మీకు ఆర్థికంగా భారం కావచ్చు. అలాంటప్పుడు వాటిని మార్చుకోండి. అలా కాకుండా ఆర్థికంగా ఇబ్బంది లేదూ అనుకుంటే అన్ని డ్యూ డేట్లు దగ్గరగా ఉండేట్లు చూసుకుంటే మంచిది.

పేమెంట్ చేయలేకపోతే ఏం చేయాలి..

మీ కార్డు పేమెంట్స్ కు మీరే బాధ్యులు. ఒకవేళ ఆ డ్యూ డేట్ కు బ్యాలెన్స్ మొత్తం కట్టలేకపోతే.. బ్యాంకు అధికారులతో మాట్లాడాలి. కొన్ని బ్యాంకు లేట్ ఫీజును ఉపసంహరించుకునే అవకాశం ఇస్తాయి. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఇలా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. దీనిని వినియోగించుకోవాలి.

సరిపడినంత డబ్బు లేకపోతే..

మీ దగ్గర డ్యూ అమౌంట్ అంత నగదు లేదు అనుకోండి ఆ విషయాన్ని బ్యాంకు అధికారులతో చర్చించాలి. ఆ సమయంలో ఓ మంచి ఆప్షన్ కంపెనీలు మీకు అందిస్తాయి. మీరు కట్టాల్సిన మొత్తాన్ని ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. లేదా ఏదైనా పర్సనల్ లోన్ తీసుకుని మొత్తం అవుట్ స్టాండింగ్ ను క్లియర్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..