Credit Cards: క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?

క్రెడిట్ వాడడం మాత్రమే కాదు. ఎలా వాడాలో తెలిస్తే క్రెడిట్ కార్డు ప్రయోజనాలన్నీ మనం పొందవచ్చు. మనం నిత్యం వాడే క్రెడిట్ కార్డు గురించి అన్ని విషయాలు తెలుసుకోకపోతే ఆయా బ్యాంకులు ఇచ్చే చాలా లాభాలను కోల్పోతాం.

Credit Cards: క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?
Using Credit Cards
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 16, 2022 | 4:25 PM

ప్రస్తుతం కాలంలో ఉద్యోగస్తులకు గానీ, వ్యాపారస్తులకు గానీ క్రెడిట్ కార్డు ఉండడం అనేది సర్వ సాధారణమైన విషయంగా మారింది. మనం షాపింగ్ లేదా విహారయాత్రలు ఇలా ఎక్కడికి వెళ్లినా క్రెడిట్ కార్డు ఉంటే దానితోనే లావాదేవీలు జరపడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే క్రెడిట్ కార్డు వాడితే వెంటనే మన డబ్బు జమ కాదు. పైగా క్రెడిట్ బిల్ జనరేట్ అయ్యాక బిల్లు కట్టుకోవచ్చు అనే ధీమాతో కచ్చితంగా క్రెడిట్ కార్డు లావాదేవీకే ఓటేస్తాం. అయితే క్రెడిట్ వాడడం మాత్రమే కాదు. ఎలా వాడాలో తెలిస్తే క్రెడిట్ కార్డు ప్రయోజనాలన్నీ మనం పొందవచ్చు. మనం నిత్యం వాడే క్రెడిట్ కార్డు గురించి అన్ని విషయాలు తెలుసుకోకపోతే ఆయా బ్యాంకులు ఇచ్చే చాలా లాభాలను కోల్పోతాం. క్రెడిట్ కార్డుదారులు బ్యాంకులు ఇచ్చే బెన్ ఫిట్స్ ను ఎలా పొందాలో, అలాగే కొత్త క్రెడిట్ కార్డులను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చూద్దాం. 

క్రెడిట్ కార్డు సెలెక్షన్

మనం క్రెడిట్ కార్డును తీసుకునే సమయంలోనే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. మన అవసరాలకు తగిన క్రెడిట్ కార్డును పొందేందుకు ప్రయత్నించాలి. షాపింగ్ ఎక్కువ చేసే వారైతే షాపింగ్ బోనస్ వచ్చే కార్డులు, ఎక్కువుగా ప్రయాణించే వారైతే వాటికి సంబంధించిన కార్డును ఎంచుకోవడం ఉత్తమం. కార్డు ఫీచర్లు, రివార్డు పాయింట్లు అందుబాటులో ఉన్న డిస్కౌంట్లు గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. కార్డు జారీ చేసే సమయంలో నియమ, నిబంధనలను తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

సైనప్ బోనస్ లు

మనం క్రెడిట్ కార్డులను పొందే సమయంలోనే మనకు వచ్చే ప్రయోజనాలను ఓ సారి కార్డు ఎగ్జిక్యూటివ్ ద్వారా తెలుసుకుంటే మంచిది. మీకు వెల్కమ్ బెన్ ఫిట్స్, క్యాష్ బ్యాక్ లు, రివార్డు పాయింట్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే వాటి గురించి నిశితంగా తెలుసుకోవాలి. అయితే అన్నికార్డుల్లో ఇలాంటిప్రయోజనాలు ఉండవని గుర్తుంచుకోవాలి. వెల్కమ్ బెన్ ఫిట్స్ కొన్ని కార్డుల్లో మాత్రమే వినియోగదారులను ఆకర్షించడానికి ఆయా కంపెనీలు ఇస్తాయనే విషయంపై మనకు అవగాహన ఉండాలి.

ఇవి కూడా చదవండి

బిల్లు చెల్లింపు సమయంపై అవగాహన

సాధారణంగా మనం వాడే క్రెడిట్ కార్డుల్లో మనం వాడిన సొమ్ముకు బిల్ జనరేట్ అయ్యాక దాన్ని చెల్లించడానికి 20 నుంచి 55 రోజుల సమయం ఉంటుంది. అయితే మనం కార్డు తీసుకునే సమయంలోనే మన నగదు లభ్యత బట్టి బిల్లు తిరిగి కట్టే సమయం వీలైనంతా ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మంచిది. సుదీర్ఘ వడ్డీ రహిత కాలం బిల్లులు చెల్లించే ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

క్రెడిట్ స్కోర్ ను గమనించాలి

క్రెడిట్ కార్డులు, క్రెడిట్ స్కోర్ ఒకదానిపై ఒకటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మీకు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే మీకు క్రెడిట్ కార్డు ఇవ్వడానికి ఆయా బ్యాంకులు అనుమతించవు. కాబట్టి కొత్త కార్డులు పొందడానికి ఇబ్బంది ఎదురవుతుంది. మన క్రెడిట్ స్కోర్ ను నిలకడగా ఉంచుకోవాలంటే కచ్చితంగా సమయానికి క్రెడిట్ కార్డు బిల్లులను కట్టేయ్యాలి. అలాగే క్రెడిట్ స్కోర్ ను అవసరమైనప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.

రివార్డ్ పాయింట్స్ రెడీమ్

మనం వాడే క్రెడిట్ అమౌంట్ కు అనుగుణంగా మనకు కొన్ని రివార్డు పాయింట్లు యాడ్ అవుతాయి. అవి తరచూ మన క్రెడిట్ కార్డు అకౌంట్ లో చెక్ చేసుకోవడం మంచిది. ఆయా రివార్డు పాయింట్లకు కాలపరిమితి ఉంటే ముందుగానే రిడీమ్ చేసుకోవడం ఉత్తమం. క్రెడిట్ కార్డ్, దాని జారీ చేసే ప్రొవైడర్ ను బట్టి రివార్డు పాయింట్ల కాలపరిమితి ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి