AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinder: ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ పొందడం ఎలా..? వారికి మాత్రమే ఈ ప్రయోజనం

దేశంలోని పేదలకు సహాయం చేయడానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వం ద్వారా పేదలకు ఆర్థిక సహాయం నుంచి ఉచిత రేషన్ వరకు అందజేస్తోంది..

LPG Cylinder: ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ పొందడం ఎలా..? వారికి మాత్రమే ఈ ప్రయోజనం
PMUY Scheme
Subhash Goud
|

Updated on: Dec 16, 2022 | 6:05 PM

Share

దేశంలోని పేదలకు సహాయం చేయడానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వం ద్వారా పేదలకు ఆర్థిక సహాయం నుంచి ఉచిత రేషన్ వరకు అందజేస్తోంది. ఈ క్రమంలో పేదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎల్‌పీజీ కనెక్షన్లు అందించే పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వంలో దీని కోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) ప్రారంభించారు. ఈ పథకాన్ని మే 2016లో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ‘ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన’ను గ్రామీణ, నిరుపేద కుటుంబాలకు ఎల్‌పీజీ వంటి స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించే లక్ష్యంతో ఒక ప్రధాన పథకంగా ప్రవేశపెట్టింది. సాంప్రదాయ వంట ఇంధనాలైన కట్టెలు, బొగ్గు, ఆవు పేడ మొదలైన వాటి వాడకం గ్రామీణ మహిళల ఆరోగ్యంతో పాటు పర్యావరణంపై హానికరమైన ప్రభావాలను చూపుతుందనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మందికి గ్యాస్‌ కనెక్షన్‌ అందింది.

పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్ బీపీఎల్‌ కుటుంబాలకు అందిస్తోంది. ఈ పథకం కింద ప్రతి కనెక్షన్ గ్యాస్ స్టవ్ కొనుగోలు, సిలిండర్ రీఫిల్ కోసం వడ్డీ రహిత రుణం పొందేందుకు అర్హులు. మరోవైపు, ఎల్‌పిజి కనెక్షన్‌కు సంబంధించిన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాన్ని పొందడానికి ప్రభుత్వం అనేక అర్హతలను విధించింది. పూర్తి అర్హతలున్నవారు మాత్రమే ఈ పథకాన్ని ఈ అర్హత ప్రమాణాలు నెరవేరితే, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాలను పొందవచ్చు.

ఎలాంటి అర్హతలు ఉండాలి..?

☛ భారతీయ పౌరురాలై ఉండాలి.

ఇవి కూడా చదవండి

☛ 18 ఏళ్లు నిండి ఉండాలి.

☛ ఎల్‌పీజీ కనెక్షన్ లేని, బీపీఎల్‌ కుటుంబానికి చెందిన మహిళ అయి ఉండాలి.

☛ ఇతర పథకాల కింద కింద ఎలాంటి ప్రయోజనం పొంది ఉండకూడదు.

☛ బ్యాంకు ఖాతా ఉండాలి.

☛ ఎస్సీ/ఎస్టీ కుటుంబాల కింద ఎస్‌ఈసీసీ 2011 లేదా బీపీఎల్‌ కుటుంబాల జాబితాలో చర్చిన లబ్ధిదారులు, పీఎంఏవై, ఏఏవై, అత్యంత వెనుకబడిన తరగతులు, అటవీ నివాసులు, నదీ ద్వీపాలలో నివసించే వ్యక్తులు.

☛ ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు దరఖాస్తు కోసం ఆన్‌లైన్ పోర్టల్‌కి వెళ్లవచ్చు. అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా మీ సేవా కేంద్రాలకు కూడా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి