AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: మరో వ్యాపారంలోకి రిలయన్స్‌.. ఇండిపెండెన్స్ బ్రాండ్‌ ప్రారంభం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలో వ్యాపారం మరింతగా విస్తరిస్తోంది. ఈ సంవత్సరం జ‌రిగిన ఏజీఎం స‌మావేశంలో ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లోకి ప్రవేశిస్తామ‌ని ప్రకటించిన విషయం తెలిసిందే..

Mukesh Ambani: మరో వ్యాపారంలోకి రిలయన్స్‌.. ఇండిపెండెన్స్ బ్రాండ్‌ ప్రారంభం
Fmcg Brand Independence
Subhash Goud
|

Updated on: Dec 15, 2022 | 8:01 PM

Share

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలో వ్యాపారం మరింతగా విస్తరిస్తోంది. ఈ సంవత్సరం జ‌రిగిన ఏజీఎం స‌మావేశంలో ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లోకి ప్రవేశిస్తామ‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ఇండిపెండెన్స్ అనే బ్రాండ్ పేరుతో రిల‌య‌న్స్-ఎఫ్ఎంసీజీ సెక్టార్ సేవ‌లు ప్రారంభించింది. రిలయన్స్ గ్రూప్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసిజి) బ్రాండ్ ‘ఇండిపెండెన్స్’ను గుజరాత్‌లో గురువారం ప్రారంభించింది. ఈ బ్రాండ్ కింద కంపెనీ ఆహార పదార్థాలతో సహా రోజువారీ వినియోగ వస్తువులను సరఫరా చేస్తుంది. రిలయన్స్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవం కార్యక్రంమ సందర్భంగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడారు. మా స్వంత ఎంఎంసీజీ బ్రాండ్‌ను ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నామని అన్నారు.

ఎడిబుల్ ఆయిల్, పప్పులు, ధాన్యాలు, ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్, ఇతర నిత్యవసర వస్తువులను నాణ్యమైన, సరసమైన ధరలకు సరఫరా చేస్తామని చెప్పారు. ఇందులో నిత్యావ‌స‌ర వ‌స్తువులు, శుద్ధి చేసిన ఫుడ్ ప్రొడ‌క్ట్స్‌ను ఇండిపెండెన్స్ పేరిట విక్రయిస్తారు. బిస్కట్లు, వంట‌నూనెలు, ప‌ప్పులు, తృణ ధాన్యాలు వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడ‌క్ట్స్‌, ఇత‌ర నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను ఇండిపెండెన్స్ బ్రాండ్ కింద విక్రయిస్తామ‌ని ఇషా అంబానీ తెలిపారు.

గుజరాత్‌ను ‘గో టు మార్కెట్‌’ రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో గొప్ప ఎఫ్‌ఎంసిజి పరిశ్రమను అమలు చేయబోతున్నాం. క్రమంగా బ్రాండ్ దేశవ్యాప్తంగా విస్తరించబడుతుందని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ విలువ రూ.2 ట్రిలియన్ల విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. FY22లో కంపెనీ అమ్మకాలు, సేవల విలువ రూ.1,99,749 కోట్లు. రిల‌య‌న్స్ రిటైల్‌కు సొంతంగా దేశ‌వ్యాప్తంగా 16,500 స్టోర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు