AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: ఇస్రో ఘనత.. విదేశీ ఉపగ్రహాల ప్రయోగానికి రూ.1,100 కోట్లు ఆర్జించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 2018 నుంచి దాదాపు రూ.1,100 కోట్ల వ్యయంతో 19 దేశాలకు చెందిన 177 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా..

ISRO: ఇస్రో ఘనత.. విదేశీ ఉపగ్రహాల ప్రయోగానికి రూ.1,100 కోట్లు ఆర్జించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ
ISRO
Subhash Goud
|

Updated on: Dec 15, 2022 | 7:44 PM

Share

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 2018 నుంచి దాదాపు రూ.1,100 కోట్ల వ్యయంతో 19 దేశాలకు చెందిన 177 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, కొలంబియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, లిథువేనియా, లక్సెంబర్గ్, మలేషియా, నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగపూర్, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, యుఎస్ఎ నుండి ఉపగ్రహాలను ప్రయోగించింది. విదేశాలతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఆయా దేశాల ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ-ఎంకేఐఐఐ ద్వారా ప్రయోగించారు.

జనవరి 2018 నుండి నవంబర్ 2022 వరకు, ISRO 177 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది, విదేశీ మారకం ద్వారా 94 మిలియన్ US డాలర్లు, 46 మిలియన్ యూరోలను ఆర్జించింది. కేంద్ర అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ రాజ్యసభలో సమాచారం ఇచ్చారు. అంతరిక్ష రంగంలో అనేక దార్శనిక సంస్కరణల కోసం ప్రభుత్వం జూన్ 2020లో చర్య తీసుకుంది. ప్రభుత్వేతర సంస్థలు కూడా వాణిజ్య లక్ష్యాలతో అంతరిక్ష రంగ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయని తెలిపారు. అంతరిక్ష రంగంలో మెరుగుదల కోసంLVM3 ప్రయోగానికి దారితీశాయి. ఇందులో 36 వాణిజ్య ఉపగ్రహాలు ఉన్నాయి. ఇటీవల ప్రైవేట్ రంగ స్కైరూట్ ఏరోస్పేస్ కూడా ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రారంభించిందని ఆయన చెప్పారు.

ఇస్రో ఇటీవల 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాల తొలి వాణిజ్య ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అత్యంత బరువైన రాకెట్ GSLV-MkIII ప్రయోగం విజయవంతమైంది. చరిత్రలో తొలిసారిగా జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను వాణిజ్య ప్రయోగానికి వినియోగించారు. ఇన్-స్పేస్ అబ్జర్వేషన్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వేతర సంస్థలు అంతరిక్ష కార్యకలాపాలను అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. ఇది స్టార్టప్‌లకు ఉపయోగపడింది. దాదాపు 111 స్టార్టప్‌లు ఈ విధానంలో నమోదు చేసుకున్నాయని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి