Property Sale: పాత ఇంటిని అమ్మి.. కొత్త ఇల్లు కొంటే టాక్స్ కట్టాల్సి ఉంటుందా?

మీరు కనుక మీ పాత ఇంటిని అమ్మి కొత్త ఇంటిని కొంటుంటే మీరు తప్పనిసరిగా టాక్స్ నిబంధనల చిక్కుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంటిని అమ్మడం ద్వారా వచ్చే..

Property Sale: పాత ఇంటిని అమ్మి.. కొత్త ఇల్లు కొంటే టాక్స్ కట్టాల్సి ఉంటుందా?
Property Sale
Follow us

|

Updated on: Dec 16, 2022 | 6:34 PM

మీరు కనుక మీ పాత ఇంటిని అమ్మి కొత్త ఇంటిని కొంటుంటే మీరు తప్పనిసరిగా టాక్స్ నిబంధనల చిక్కుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంటిని అమ్మడం ద్వారా వచ్చే లాభాలపై క్యాపిటల్ గెయిన్‌కి రెండు రకాలుగా పన్ను విధిస్తారు. ఆ ఇంటిని 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంచిన తర్వాత అమ్మితే, అది దీర్ఘకాలిక మూలధన లాభం అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గా పరిగణిస్తారు. కాపిటల్ మొత్తం ఇండెక్సేషన్ ప్రయోజనం తర్వాత లాభంపై 20% టాక్స్ విధిస్తారు. అయితే, 24 నెలల ముందు ఇంటిని అమ్మడం ద్వారా వచ్చే లాభం స్వల్పకాలిక మూలధన లాభంగా అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గా పరిగణిస్తారు. ఈ లాభం ఆ వ్యక్తి రెగ్యులర్ ఇన్ కం కు కలపడం జరుగుతుంది. దీనిపై టాక్స్ శ్లాబ్ ప్రకారం టాక్స్ కట్టాల్సి వస్తుంది.

టాక్స్ ఎప్పుడు, ఎలా ఆదా చేయవచ్చు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54 పాత ఇంటిని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం అంటే కేపిటల్ గెయిన్స్ నుంచి రెండవ ఇంటిని కొనడంపై టాక్స్ మినహాయింపు ఇస్తుంది. ఈ ప్రయోజనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విషయంలో మాత్రమే అనేది గుర్తుంచుకోవాలి. ఆదాయపు పన్ను చట్టం అటువంటి వాటిని గుర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇల్లు అమ్ముతున్నవారి టార్గెట్ తనకు ఉన్న ఇల్లు అమ్మి దానిపై డబ్బు సంపాదించడం కాదు. మరో విధంగా తనకు కావలసిన ఇంటిని కొనుక్కోవడం కోసం అనేది ఇన్ కామ్ టాక్స్ డిపార్ట్మెంట్ అర్ధం చేసుకుంటుంది.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54లో క్యాపిటల్ పై వచ్చే రాబడిని నివాస ప్రాపర్టీ కొనుగోలు లేదా నిర్మాణానికి మాత్రమే ఉపయోగించాలని స్పష్టంగా ఉంది. అంటే వాణిజ్యపరమైన ఆస్తి కొనుగోలుపై టాక్స్ మినహాయింపు లభించదు. భూమి విషయంలో, ప్లాట్ కొనుగోలు, ఇంటి నిర్మాణంపై, క్యాపిటల్ గెయిన్స్ పన్నుకు సమానమైన మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు. భూమి కొనుగోలుపై మాత్రమే పన్ను మినహాయింపు అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఎవరైనా రెసిడెన్షియల్ ప్రాపర్టీని ఎప్పుడు కొనుగోలు చేయాలి అనే సందేహం ఉంటుంది. ఈ విషయం గురించి తెలసుకుందాం. సెక్షన్ 54 ప్రకారం.. టాక్స్ మినహాయింపు పొందేందుకు పాత ఆస్తిని బదిలీ చేసిన తేదీ నుంచి 2 సంవత్సరాలలోపు కొత్త ఇంటిని కొనుగోలు చేయాలి. అదే కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే మాత్రం ఇంటి నిర్మాణాన్ని మూడేళ్లలోపు పూర్తి చేయాలి. మీరు పాత ప్రాపర్టీని అమ్మడానికి ఒక సంవత్సరం ముందు కూడా కొత్త ఇంటిని కొనుక్కోవచ్చు. అప్పుడు కూడా మీకు టాక్స్ మినహాయింపు దొరుకుతుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles