Vehicle Insurance: ఏడాది లేదా మూడేళ్లు.. కారు ఇన్సూరెన్స్ కోసం ఏది బెటర్?.. నిపుణులు ఏం చెబుతున్నారు?
కొత్త కారు కొనుగోలు చేసినప్పుడు కారుతో పాటు రకరకాల ఆక్సెసరీస్ కూడా తీసుకుంటాము. దాంతోపాటూ, మరికొన్ని ఖర్చులు కూడా అవుతుంటాయి. కానీ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి 1-ఇయర్ ఇన్సూరెన్స్..
కొత్త కారు కొనుగోలు చేసినప్పుడు కారుతో పాటు రకరకాల ఆక్సెసరీస్ కూడా తీసుకుంటాము. దాంతోపాటూ, మరికొన్ని ఖర్చులు కూడా అవుతుంటాయి. కానీ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి 1-ఇయర్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలా లేక 3-ఇయర్ ప్లాన్ తీసుకోవాలా అనే విషయంలో చాలా మంది అయోమయంలో పడుతుంటారు. రెండు బీమా పథకాలలో దేనికి దానికి లాభాలూ, నష్టాలు కూడా ఉన్నాయి. కారు బీమా ప్లాన్‌ను కొనుగోలు చేసే ముందు వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. 2018లో సుప్రీంకోర్టు 3 సంవత్సరాల పాటు బీమా పాలసీకి థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీని తప్పనిసరి చేసింది. ఒకవైపు 3 సంవత్సరాల పాటు థర్డ్ పార్టీ బాధ్యత కవర్ కలిగి ఉండటం తప్పనిసరి. మరోవైపు మీరు ఒకేసారి సంవత్సరం కాంప్రహేన్సీవ్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. థర్డ్ పార్టీ కవర్ అంటే బీమా హోల్డర్ కారు మరొక వ్యక్కి సంబంధించిన ఆస్తిని పాడు చేసినట్లయితే లేదా అతను భౌతికంగా గాయపడినట్లయితే ఆ సందర్భంలో కవర్ అవుతుంది.
అలాగే కాంప్రహేన్సీవ్ కవర్‌లో, థర్డ్ పార్టీ నష్టాలతో పాటు మరమ్మత్తు లేదా భర్తీ ఖర్చుకూడా కవర్ అవుతుంది. కాంప్రహేన్సీవ్ కారు ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం.. దాని ప్రయోజనం ఏమిటంటే ముందస్తు ఖర్చు తక్కువగా ఉంటుంది. మీరు 1 సంవత్సరానికి మాత్రమే డబ్బు ఇస్తున్నందున 1 సంవత్సరం బీమా పాలసీని కొనుగోలు చేయడం చౌకగా ఉంటుంది. 1 సంవత్సరం పాలసీలో అతిపెద్ద ప్రయోజనం ఐడీవీకి సంబంధించినది. అది బీమా చేసిన డిక్లేర్డ్ విలువ. బహుళ-సంవత్సరాల పాలసీని కొనుగోలు చేసినప్పుడు బీమా కంపెనీ దాని ప్రామాణిక ఐడీవీ లెక్కల ప్రకారం..ఐడీవీని లాక్ చేస్తుంది. అంటే మీరు మీ దీనిని ఒక్కసారి మాత్రమే సెట్ చేయవచ్చు. అంటే పాలసీ టర్మ్ ప్రారంభంలో మాత్రమే ఇది చేయడం జరుగుతుంది. దీనికి విరుద్ధంగా ఒక సంవత్సరం పాలసీలో, మీరు ప్రతి సంవత్సరం మీ ఐడీవీని సెట్ చేయవచ్చు. ఇది ఒక అదనపు చెల్లింపుతో మీ వాహనం విలువను పెంచుకునే సదుపాయాన్ని ఇస్తుంది.
ఒక సంవత్సరం బీమా అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు ప్రతి సంవత్సరం బీమా కంపెనీని మార్చవచ్చు. అంటే మీకు బీమా కంపెనీ సేవలు నచ్చకపోతే, దాన్ని మూడేళ్లపాటు ఉపయోగించకుండా కొత్త ప్రదేశం నుంచి బీమా పొందవచ్చు. అదే సమయంలో మూడేళ్ల బీమా ప్లాన్‌లో మీరు ప్రతి సంవత్సరం పాలసీని రెన్యూవల్ చేసుకునే ఇబ్బందులను నివారించవచ్చు. ఒకేసారి బీమాను కొనుగోలు చేయడం ద్వారా మీరు మూడేళ్లపాటు ఎలాంటి టెన్షన్ ఉండదు. ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఒకేసారి బహుళ-సంవత్సరాల బీమా పథకాన్ని తీసుకోవడం ద్వారా మీరు రెండు లేదా మూడు సంవత్సరాల పాటు దాని గురించి చింతించకుండా నివారించవచ్చు. మరొక పెద్ద ప్రయోజనం తక్షణ నో క్లెయిమ్ బోనస్ అంటే ఎన్‌సీబీ. మీరు పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా మీ కారును విక్రయించి, కొత్త కారును కొనుగోలు చేసినప్పుడు ఎన్‌సీబీని కొత్త కారుకు బదిలీ చేయవచ్చు. కొత్త ప్రీమియంపై తగ్గింపు పొందవచ్చు.
మరొక ప్రయోజనం తక్కువ ఖర్చుతో కూడుకున్న యాడ్-ఆన్‌లు. మీరు బహుళ-సంవత్సరాల బీమా పాలసీని తీసుకున్నప్పుడు ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ప్రొటెక్షన్ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్, జీరో డిప్రిసియేషన్ కవర్ వంటి వివిధ యాడ్-ఆన్‌లపై కంపెనీ మీకు భారీ తగ్గింపులను అందిస్తుంది. మొత్తంమీద రెండు ప్లాన్‌లకు వాటి స్వంత లాభాలు, నష్టాలు ఉన్నాయి. ఏ పాలసీని పొందాలో నిర్ణయించేటప్పుడు మీరు ఎప్పుడూ మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని, మీకు ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి